శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (09:33 IST)

13-04-2020 సోమవారం దినఫలాలు - మల్లిఖార్జున స్వామిని ఆరాధిస్తే...

మేషం : ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవల్ల మాటపడవలసి వస్తుంది. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తోంది. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
వృషభం : వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. బాకీలు వసూలు కాకపోగా ఇబ్బందులెదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. ఆకస్మిక బిల్లులు చెల్లిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి యజమాన్యంతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. 
 
మిథునం : కొబ్బరి, పండ్లు, పానీయ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ శ్రీమతి సలహా పాటించి లబ్ది పొందుతారు. ప్రయాణాల్లో చికాకులు, ప్రయాసలు తప్పవు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనివారలతో చికాకులు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 
 
కర్కాటకం : ఆర్థిక ఇబ్బందులు లేకున్నా ఏదో అసంతృప్తి వెన్నాడుతుంది. ప్రతి విషయంలోనూ ఓర్పు, సంయమనం అవసరం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు, పథకాలు మున్ముందు మంచి ఫలితాలినిస్తాయి. రాబడికి మించి ఖర్చులుంటాయి. సమయానికి కావలసిన పత్రాలు కనిపించకపోవచ్చు. 
 
సింహం : సొంతంగా వ్యాపారం, సంస్థలు, పరిశ్రమలు నెలకొల్పాలనే ఆలోచన బలపడుతుంది. ఉద్యోగ బదిలీ యత్నాలుఫలిస్తాయి. ఒక్కోసారి మంచి చేసిన విమర్శలు తగవు. రుణబాధలు, దీర్ఘకాలిక సమస్యలు క్రమేణా సర్దుకుంటాయి. కార్యసాధనంలో అనుకూలత, చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాగలవు. 
 
కన్య : స్త్రీలు బంధుమిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. ఏదైనా విలువైన వస్తువు అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. వ్యాపార రంగాల వారికి దస్త్రం ముహూర్తం నిర్ణయిస్తారు. బ్యాంకు వ్యాపారాలు చురుకుగా సాగుతాయి. 
 
తుల : చిట్స్, ఫైనాన్స్ వ్యాపారుల మొండి బాకీలు వేధిస్తారు ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ముఖ్యమైన పనులలో ఏకాగ్రత వహిస్తారు. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
వృశ్చికం : పత్రిక, వార్తా సంస్థలలోని వారికి మంచి గుర్తించి లభిస్తుంది. ఎలక్ట్రానిక్ మీడియా వారు ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. ఇతరుల ధనసహాయం చేసిన తిరిగి రాబట్టుకోవడం కష్టం. వృత్తి వ్యాపారాలు సామాన్యం. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. 
 
ధనస్సు : ఆర్థిక ఇబ్బందులు లేకున్నా ఏదో అసంతృప్తి వెన్నాడుతుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహిచండి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. శాస్త్ర, సాంకేతిక, బోధనా సిబ్బందికి సదావకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఒక పట్టాన పరిష్కారం కావు. 
 
మకరం : విద్యుత్ రంగాల వారికి పనిలో ఒత్తిడి అధికమవుతుంది. గృహంలో మార్పులకు, చేర్పులకు వాయిదా పడతాయి. వృత్తుల వారికి చికాకులు, ఒత్తిడులు తప్పవు. విద్యార్థులు బజారు తినుబండరాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి శుభం చేకూరుతుంది. 
 
కుంభం : ఐరన్, రంగం వారికి ఆటంకాల. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చికాకులు తలెత్తుతాయి. మందులు, ఎరువులు, సుగంధద్రవ్య వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. రవాణా రంగంలోని వారికి లాభదాయకం. పాత మిత్రులను కలుసుకుంటారు. 
 
మీనం : ఒక స్థాయి వ్యక్తుల కలయిక ఆశ్చర్యం కలిగిస్తుంది. టెండర్లు చేజిక్కించుకుంటారు పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు చికాకులు ఎదురవుతాయి. ఉన్నతస్థాయి అధికారులు అపరిచిత వ్యక్తులను ఓ కంట కనిపెట్టడం మంచది. పారిశ్రామికులకు విద్యుత్ లోపం వల్ల ఆందోళనకు గురవుతారు.