గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

16-04-2020 గురువారం దినఫలాలు : రాఘవేంద్ర స్వామిని పూజించినా...

మేషం : ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వల్ల అనుకోని ఇబ్బందులెదుర్కొంటారు. దంపతుల మధ్య దాపరికం అనర్థాలకు దారితీస్తుంది. కిరణా, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారులకు సంతృప్తి. పురోభివృద్ధి. దైవ, సేవా కార్యక్రమాల కోసం ధనం విరివిగా వెచ్చిస్తారు. విరాళాలు ఇచ్చే విషయంలో మెళకువ వహించండి. 
 
వృషభం : ప్రింట్, ఎలక్ట్రానిక్ వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఫ్లీడర్లకు తమ క్లెయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. గృహంలో ప్రశాంతత లోపం, ఆరోగ్య సమస్యలు వంటి చికాకులు అధికమయ్యే అవకాశం ఉంది. మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. రవాణా రంగంలోని వారు చికాకులను ఎదుర్కొంటారు. 
 
మిథునం : వస్త్ర, బంగారు, వెండి, లోప, గృహోపకరణ వ్యాపారులకు కలిసిరాగలదు. ఉద్యోగస్తులు నిర్లక్ష్య ధోరణి వల్ల మతిమరుపు వల్ల అధికారులతో మాటపడక తప్పదు. అలౌకిక విషయాలు, ఆరోగ్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకింగ్ వ్యవహారాలు, ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. 
 
కర్కాటకం : స్త్రీలకు కొత్త వ్యాపకాలు, ఆలోచనలు స్ఫురిస్తాయి. విదేశీయానయత్నాల్లో జాప్యం తప్పదు. సాంఘిక, సాంస్కృతి కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విలాసాలకు, ఆడంబరాలకు వ్యయం చేసే విషయంలో ఆలోచన, పొదుపు అవసరం. ప్రేమికుల తొందరపాటుతనం అనర్థాలకు దారితీస్తుంది. 
 
సింహం : దైవ, సాంఘిక, సేవా కార్యక్రమాల పట్ల శ్రద్ధ కనపరుస్తారు. భాగస్వామిక చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలతో మెళకువ అవసరం. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరక పటుత్వం నెలకొంటుంది. ఒక స్థిరాస్తి అమర్చుకునేందుకు తీవ్రంగా యత్నిస్తారు. 
 
కన్య : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో పెద్దల సలహా పాటించడం మంచిది. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
తుల : ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. దైవ కార్యాలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
వృశ్చికం : ఏసీ, కూలర్, ఇన్వర్టర్లు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ధనం పొదుపు చేయాలన్న మీ ఆలోచన ఫలిస్తుంది. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిదికాదు. 
 
ధనస్సు : స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. రాజకీయ, కళా రంగాల వారికి సన్మానం జరిగే అవకాశం ఉంది. రుణ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు తొలగిపోతాయి. భాగస్వాములతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. అక్రమ సంపాదనల వైపు దృష్టి సారించకపోవడం మంచిది. ప్రేమకులు పెద్దల వల్ల సమస్యలు తలెత్తుతాయి. 
 
మకరం : ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. ఇంజనీరింగ్ రంగాల వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. దైవకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కుంభం : ఏదైనా అమ్మటానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడటం మంచిది. మీ పథకాలు, ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆఫీసులో తొందరపాటు నిర్ణయాలతో కాక, మీ సీనియర్ల సలహాలను తీసుకుని ముందుకుసాగండి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. క్రీడా, కళా, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి వహిస్తారు. 
 
మీనం : కిరాణా ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ, విత్తన వ్యాపారులకు స్టాకిస్టులకు ఆర్థికాభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రావలసిన ధనం అందటంతో నిర్మాణ కార్యక్రమాలు చురుకుగా సాగుతాయి. స్త్రీలకు రచనలు, సమాజసేవపట్ల ఆసక్తి పెరుగుతుంది.