ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 28 డిశెంబరు 2018 (10:06 IST)

28-12-2018 - శుక్రవారం మీ రాశి ఫలితాలు - మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది....

మేషం: విదేశాలు వెళ్లే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయాన్ని పొందుతారు. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధువులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది.
 
వృషభం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకు, ఏకాగ్రత చాలా అవసరం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణ ఆందోళన కలిగిస్తుంది. పొదుపు పథకాలపై శ్రద్ధ వహించండి. మీ ఉన్నతిని చూసి ఆసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు సజావుగా సాగుతాయి.  
 
మిధునం: దైవ, సాంఘిక కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. షేర్ల క్రయవిక్రయాలు లాభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. మీ కళత్ర మొండివైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు సంపాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కర్కాటకం: ఆర్థిక ఒడిదుడుకుల వలన చికాకులను ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎదుటివారికి ఉచిత సలహాలు ఇవ్వడం వలన ఇబ్బందులను గురికావలసివస్తుంది. మీ ప్రత్యర్థుల ఎత్తుగడలను దీటుగా ఎదుర్కుంటారు. ధనం ముందుగానే సిద్ధం చేసుకోవడానికి యత్నించండి.  
 
సింహం: వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. సంఘంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. ఊహించని ఖర్చుల వలన చేబదుళ్ళు తప్పవు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఏదైనా స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరమించుకుంటారు. 
 
కన్య: దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. భాగస్వామికంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్పురిస్తుంది. వీలైనంత వరుకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు, ఒత్తిడి వంటి చికాకులు ఎదుర్కుంటారు.  
 
తుల: ఆలస్యంగా అయినా పనులు అనుకున్న విధంగా పూర్తికాగలవు. రాజకీయనాయకులు పార్టీలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు సంతృప్తి. మీ ఆశయ సిద్ధికి అవరోధాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు. అనుభవ పూర్వకంగా మీ తప్పిదాలను సరిదిద్దుకుంటారు. 
 
వృశ్చికం: బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. పట్టింపుల వలన స్త్రీలు విలువైన అవకాశాలు కోల్పోయే ఆస్కారం ఉంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు సదవకాశాలు లభిస్తాయి. కుటుంబీకుల మధ్య ప్రే, వాత్యల్యాలు పెంపొందుతాయి.  
 
ధనస్సు: పోస్టల్, టెలిగ్రాఫ్, కొరియర్ రంగాల్లో వారికి ఒత్తిడి, పనిభారం, చికాకులు అధికమవుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారి ఎంత శ్రమించినా యాజమాన్యం గుర్తింపు ఉండదు. ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమించి పెండింగ్ పనులూ పూర్తిచేస్తారు. 
 
మకరం: గృహమునకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. ఒకనాటి మీ కష్టానికి నేడు ప్రతిఫలం లభిస్తుంది. విదేశీయాన యత్నాలలో ఆటంకాలు తొలగిపోగలవు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.    
 
కుంభం: శారీరక శ్రమ, నిద్రలేమితో ఆరోగ్యం మందగిస్తుంది. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. ఆస్తి వ్యవహారాల్లో పెద్దల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. మీ శ్రీమతి వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. ఒకేసారి అనేక పనులు మీదపడడంతో ఆందోళన చెందుతారు. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి.   
 
మీనం: వృత్తి వ్యాపారాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. కోర్లు కేసులు మంచి ఉపశమనం కలిగిస్తాయి. విలాసాలు, కుటుంబ అవసరాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. స్థిరాస్తి విక్రయానికి ఆటంకాలు తొలగిపోగలవు. వాహన చోదకులకు ఏకాగ్రత ప్రధానం.