శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 25 డిశెంబరు 2018 (18:20 IST)

25-12-2018 - మంగళవారం మీ రాశి ఫలితాలు.. దంపతుల మధ్య అవగాహన లోపం...

మేషం: విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విందు, వినోదాలలో కాలక్షేమం చేస్తారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. 
 
వృషభం: కుటుంబీకులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బంధువుల రాకతో కుటుంబంలో సందడి నెలకొంటుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మిధునం: ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. బంధుమిత్రులను విందులకు ఆహ్వానిస్తారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిదికాదని గమనించండి. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు. 
 
కర్కాటకం: రావలసిన ధనం చేతికందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో బాగుగా రాణిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. వ్యాపారాల్లో ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు.  
 
సింహం: రహస్యాలు దాచిపెట్టలేని బలహీనత ఇబ్బందులకు దారితీస్తుంది. బాకీలు, ఇంటి అద్దెల వసూళ్లల్లో సంయమనం పాటించండి. ఆస్తి పంకాల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. వాహనం నిదానంగా నడపడం క్షేమదాయకం. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. 
 
కన్య: దంపతుల మధ్య అవగాహన లోపం, పట్టింపులు చోటు చేసుకుంటాయి. మిమ్ములను కాదన్నవారే మీకు చేరువయ్యేందుకు యత్నిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. ఒప్పందాలు, సంప్రదింపులు ఫలిస్తాయి. గతంలో ఇచ్చిన హామీవలన వర్తమానంలో ఇబ్బందులు తప్పవు. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది.  
 
తుల: ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. వ్యాపకాలు తగ్గించుకుని ఉద్యోగ, వ్యాపారాలపై దృష్టి సారించండి. స్త్రీలకు చుట్టు ప్రక్కలవారితో వివాదాలు తలెత్తుతాయి. రాజకీయ నాయకులు సభ సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. 
 
వృశ్చికం: ఆత్మీయులకు శుభాకాంక్షలు అందజేస్తారు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. స్వశక్తితో పైకొచ్చిన మీరు, మరింత ముందు కెళ్లాలంటే తగిన సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస మళ్ళుతుంది. 
 
ధనస్సు: శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సన్నిహితులతో కలిగి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. పెద్దలను, గురువులను గౌరవించడం వలన మంచి గుర్తింపులు, రాణింపు లభిస్తుంది.
 
మకరం: హోటర్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. భార్య, భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తిన స్త్రీలు వాటిని తెలివితో పరిష్కరిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత నెలకొంటుంది. నూతన ప్రదేశ సందర్శనాలు ఉల్లాసాన్నిస్తాయి.    
 
కుంభం: బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఉమ్మడి వ్యాపారాలు ప్రగతిపథంలో సాగుతాయి. సోదరులతో సత్సంబందాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు దూరప్రాంతాల నుండి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాలవారికి పురోభివృద్ధి కానవస్తుంది.   
 
మీనం: బంధుమిత్రలకు శుభాకాంక్షలు అందజేస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకిత భావంతో పనిచేసి గుర్తింపు పొందుతారు. రావలసిన ధనం అందుటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. స్త్రీలు ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు.