శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 22 డిశెంబరు 2018 (08:31 IST)

22-12-2018 శనివారం దినఫలాలు - చేపట్టి పనులు మొక్కబడిగా...

మేషం: క్రీడా, కళాకారులకు ప్రోత్సాహకరం. ఒక స్థిరాస్తి విక్రయంలో అడ్డంకులు తప్పవు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. దైవారాధన పటల్ ఆసక్తి పెరుగుతుంది. పాత రుణాలను తీరుస్తారు. విద్యార్థుల మెుండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారు.
 
వృషభం: కొంతమంది మీ ఉన్నతిని, ప్రతిభను దిగజార్చేందుకు యత్నిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ధనమూలకంగా ఒక సమస్య పరిష్కారమవుతుంది. సోదరీసోదరుల మధ్య కలయిక, పరస్పర అవగాహన కుదురును. వ్యవహార ఒప్పందాల్లో మొహమ్మాటలకు తావివ్వకండి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
మిధునం: పీచు, ఫోం, లెదర్ గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి. అనవసరపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. వాహనం నిదానంగా నడుపడం మంచిది. గృహవాస్తు దోషనివారణ చేయించుకోవడం ఉత్తమ. చేపట్టి పనులు మొక్కబడిగా పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో పోటీ ఆందోళన కలిగిస్తుంది.
 
కర్కాటకం: ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారుల వైఖరి ఎంతో ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థుల్లో భయాందళన తొలగిపోయి మానసిక ప్రశాంతత చోటు చేసుకుంటుంది.   
 
సింహం: పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రైవేటు సంస్థలలో వారికి తోటి వారి కారణంగా సమస్యలు తలెత్తుగలవు. స్త్రీలకు కోరుకునే మార్పులు నిదానంగా అనుకూలిస్తాయి. దంపతులకు ఏ విషయంలోను పొత్త కుదరదు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.  
 
కన్య: వ్యాపారాల్లో కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలతో వినియోగదారులను ఆకట్టుకుంటారు. మీకోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళలో ఇబ్బందులను ఎదుర్కుంటారు.   
 
తుల: ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. పెద్దల జోక్యంతో అనుకోకుండా ఒక సమస్య సానుకూలమవుతుంది. పెంపుడు జంతుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 
 
వృశ్చికం: ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. మీ అభిప్రాయాలు గుట్టుగా ఉంచి ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మీ శ్రీమతి వైఖరి సలహా పాటించడం శ్రేయస్కరం. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. విద్యార్థులకు కొత్త పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తాయి.  
 
ధనస్సు: ఆర్థిక వ్యవహారాల్లో స్వల్ప ఒడిదుడుకులెదుర్కుంటారు. పుణ్య, సేవా శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువుల రాక వలన పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. ఉద్యోగ ప్రకటనలపై అవగాహన ముఖ్యం.  
 
మకరం: స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు వాహనం నడుపేటప్పుడు ఏకాగ్రత ముఖ్యం. వైద్య సేవలు అవసరం కావచ్చు. ప్రముఖుల కలయిక వలన ఫలితం ఉండదు.    
 
కుంభం: వ్యాపారాల్లో పోట ఆందోళన కలిగిస్తుంది. మీ పథకాలు, ప్రణాళికలు ఆశించిన ఫలితాలనీయవు. దూర ప్రయాణాలలో పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త అవసరం. స్త్రీలకు తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి.    
 
మీనం: ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాలవారికి చికాకులు తప్పవు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మందగించే సూచలున్నాయి. జాగ్రత్త వహించండి. విద్యార్థుల ఆలోచనులు పక్కదారి పట్టుకుండా మెలకువతో వ్యవహరించండి. బంధుమిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి.