సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 26 డిశెంబరు 2018 (10:38 IST)

26-12-2018 - బుధవారం మీ రాశి ఫలితాలు - బహుమతులు అందుకుంటారు...

మేషం: ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేయడం క్షేమదాయకం. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు స్త్రీలతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. బహుమతులు అందుకుంటారు.
 
వృషభం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యుల మధ్య అభిప్రాయబేధాలు తొలగిపోతాయి. నూతన వ్యక్తుల పరిచయం మీకు సంతృప్తినిస్తుంది. హోటల్, తినుబండ వ్యాపారులకు ఆందోళనలు వంటివి ఎదుర్కుంటారు. 
 
మిధునం: వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, వాణిజ్య రంగాల్లో వారికి ఆశించినంత ఫలితం ఉండదు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. మీ అభిప్రాయాలను సూచనప్రాయంగా తెలియజేయండి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. మీ సాయం పొందిన వారే వెలెత్తి చూపుతారు.  
 
కర్కాటకం: ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తుల శ్రమకు గుర్తింపు లభిస్తుంది. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిది. ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు. ప్రస్తుత వ్యాపారాలపైనే దృష్టి సారించండి.  
 
సింహం: వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడుతాయి. పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. అధికారుల ఇంటర్వ్యూకోసం పడిగాపులు తప్పవు. నిరుద్యోగులకు త్వరలోనే మంచి అవకాశం లభించే ఆస్కారం ఉంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు.  
 
కన్య: బాకీలు, ఇతరత్రా రావలసిన ఆదాయాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. మీ కృషి ఫలించకున్న ప్రయత్నించామన్న తృప్తి ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యవసాయ, తోటల రంగాలలో వారికి వాతావరణంలోని మార్పులు ఆందోళన కలిగిస్తాయి. హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి కలిసివస్తుంది.   
 
తుల: ముందు చూపుతో వ్యవహరించిన ఒక సమస్యను అధిగమిస్తారు. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యాల ప్రభావం అధికం. గృహోపకరణాలు కొనుగోలుచేస్తారు. విదేశాలు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడుతాయి. కావలసిన వ్యక్తులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో ఆటుపోట్లు, పోటీని దీటుగా ఎదుర్కుంటారు. 
 
వృశ్చికం: ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. బంధువులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. పెద్దమొత్తం ధనం డ్రా చేసేటపుడు జాగ్రత్త. సన్నిహితుల సాయంతో ఒక సమస్యను అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త సమస్యలు తలెత్తుతాయి.  
 
ధనస్సు: ఆదాయానికి మించి ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. రచయితలు, కళా, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. బ్యాంకు పనులు హడావుడిగా సాగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శానాలకు సన్నాహాలు సాగిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహక వాతావరణం ఉంటుంది. 
 
మకరం: ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. హామీలు, మధ్యవర్తిత్వాలు, మొహమ్మాటాలకు దూరంగా ఉండాలి. అవసరాలకు ధనం సర్దుబాటు చేసుకోగల్గుతారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారస్తులకు సమస్యలు తలెత్తినా లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు చక్కని అవకాశం లభిస్తుంది.    
 
కుంభం: వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ఎదుటివారి వ్యాఖ్యాలకు దీటుగా స్పందిస్తారు. గృహమునకు కావలసిన వస్తువులను అమర్చుకుంటారు. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవాలి. మీ సంతానంపై బరువు బాధ్యతలు పెరుగుతాయి.    
 
మీనం: ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. పనులు, కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కుంటారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడుతాయి.