గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

30-11-2020- సోమవారం మీ రాశి ఫలితాలు.. కుబేరుడిని పూజిస్తే..?

కుబేరుడిని పూజించినట్లైతే ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, పురోభివృద్ధి చేకూరుతుంది. 
 
మేషం: ఆర్థిక లావాదేవీలందు సంతృప్తి. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం వుంది. దూర ప్రాంతాల నుంచి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. 
 
వృషభం: ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలను అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్లుగానే వాయిదా పడతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. 
 
మిథునం: వ్యవహార, ఒప్పందాల్లో తొందరపాటు తగదు. ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల ఆరోగ్య విషయంలో సత్వరం స్పందిస్తారు. అప్పుడప్పుడు మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. చెప్పుడు మాటలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది కాదు. 
 
కర్కాటకం: విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. మీ అవసరాలకు కావలసిన ధనం ఆత్మీయుల ద్వారా సర్దుబాటు కాగలదు. సొంత వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. చేపట్టిన పనులు ఏమాత్రం ముందుకు సాగవు.
 
సింహం: ఉద్యోగస్తులు, ఉన్నతాధికారులు కొత్త వ్యక్తుల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. బంధువులను కలుసకుంటారు. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు అధికం. ఎంతో కొంత పొదుపు చేయాలనే మీ లక్ష్యం నెరవేరదు.
 
కన్య: ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల్లో కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. వాహన యోగం కలదు. వ్యాపారంలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. ప్రారంభంలోని చికాకులు క్రమేపీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో అనుకూల పరిస్థితులు కానవస్తాయి. 
 
తుల: స్త్రీలపై శకునాలు, చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా వుంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు అందినట్టే చేజారిపోతుంటాయి. మీ మాటకు ఇంటాబయటా ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు పెద్దగా వుండవు. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తకుండా వ్యవహరించండి.
 
వృశ్చికం: కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. రాబడికి మించిన ఖర్చులు, చెల్లంపులు వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. కొన్ని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. ప్లీడర్లకు, వైద్యరంగంలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
ధనస్సు: దంపతుల మధ్య ఏకాభిప్రాయం లోపిస్తుంది. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా వుండటం మంచిది. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. స్త్రీలకు ఒత్తిడి, పనిభారం అధికం కావడం వల్ల కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు.
 
మకరం: ఆత్మీయుల సాయంతో ఒక సమస్యను అధిగమిస్తారు. వనసమారాధనలు వేడుకల్లో పాల్గొంటారు. ఉన్నత పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. మీ గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రయాణాలు, బ్యాంకు పనులు ఆశించినంత చురుకుగా సాగవు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. 
 
కుంభం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా వుంటుంది. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు తప్పవు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు అమలు చేస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులను ఎదుర్కొంటారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని అనుకున్న పనులు పూర్తి కావు. 
 
మీనం: బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. అధికారులకు బాధ్యతల మార్పు, ఆకస్మిక స్థాన చలనం సంభవం. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడి కోసం యత్నాలు సాగిస్తారు. దైవ దర్శనాల్లో చికాకు లెదుర్కొంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.