సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

31-07-2020 శుక్రవారం రాశిఫలాలు - మీ ఆశయ సాధనకు...

మేషం : బంధువుల కోసం మీ పనులు వాయిదావేసుకోవలసి వస్తుంది. సమయానుకూలంగా మీ ఆహారపు అలవాట్లు, పద్ధతులు మార్చుకోవలసి వస్తుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను ధీటుగా ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విలువైన వస్తువులు ఏర్పరచుకోవాలనే స్త్రీల మనోవాంఛలు నెరవేరుతాయి. 
 
వృషభం : స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలు భవిష్యత్తులో లాభిస్తాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు ఎదుర్కొంటారు. 
 
మిథునం : పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి అనూహ్యమైన అవకాశాలు. వాతావరణంలోని మార్పులు వల్ల మీ పనులు వాయిదాపడతాయి. నిత్యావసరవస్తు స్టాకిస్టులకు లాభదాయకం. ఉమ్మడి వ్యాపారాలు, ఏజెన్సీలు, లీజులు నిదానంగా సత్ఫలితాలనిస్తాయి. సోదరులు మీతో అన్ని విషయాల్లోనూ ఏకీభవిస్తారు. 
 
కర్కాటకం : స్త్రీలకు సంభాషించునపుడు మెళకువ అవసరం. ఉద్యోగ, వ్యాపార విషయంలో ఒత్తిడి అధికమవుతుంది. గృహ నిర్మాణాలు సకాలంలో పూర్తికావు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోనివారికి ఒత్తిడి అధికమవుతుంది. బిల్లులు చెల్లిస్తారు. ఓ కార్యక్రమంలో మీ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి. 
 
సింహం : ఆర్థికస్థితిలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉన్నతోద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు కొత్త పరిచయాలు వ్యాపకాలు ఉత్సాహం కలిగిస్తాయి. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. రిప్రజెంటేటివ్‌లకు సంతృప్తి కానవస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అప్రమత్తత అవసరం. 
 
కన్య : విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. శ్రమానంతరం కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలించవు. 
 
తుల : విద్యార్థులకు టెక్నికల్, సైన్స్, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్షలలో మెళకువ అవసరం. 
 
వృశ్చికం : వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. సోమదరుల విషయంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. ఇతరుల సలహా విన్నప్పటికీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. పాత బాకీలు తీరుస్తారు. 
 
ధనస్సు : స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురవుతారు. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. తలకు మించిన బాధ్యతలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్త వహించండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి బిల్డర్లకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. 
 
మకరం : కుటుంబంలోను, బయటా ఊహించని సమస్యలు తలెత్తుతాయి. మీ జీవితం మీరు కోరుకున్నట్టుగానే ఉంటుంది. భేషజాలకు పోకుండా ధనవ్యయంలో అచితూచి వ్యవహరించండి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. బంధు మిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. 
 
కుంభం : భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసి వస్తుంది. ప్రతి విషయాన్ని మీ శ్రీమతికి అనునయంగా చెప్పడం శ్రేయస్కరం. రాబోయే అవసరాలకు ఇప్పటి నుంచే ధనం ఉంచుకోవడం మంచిది. 
 
మీనం : మీ ఆశయ సాధనకు నిరంతర కృషి పట్టుదల ముఖ్యం. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి పనిభారం అధికమవుతాయి. దంపతుల సానుకూల ధోరణితో సమస్యలు పరిష్కరించుకోవడం క్షేమదాయకం. ఆఫీసులో తొందరపాటు నిర్ణయాలతోకాక, మీ సీనియర్ల సలహాలను తీసుకుని ముందుకుసాగండి.