గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

30-07-2020 గురువారం రాశిఫలాలు - బంధువులకు తలెత్తిన కలతలన్నీ...

మేషం : ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. సాహస ప్రయత్నాలు విరమించండి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. కొందరికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే మీ ఆలోచన అనుకూలిస్తాయి. 
 
వృషభం : ఒక ముఖ్య వ్యవహారం నిమిత్తం ప్రముఖులు, ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. రాజకీయాల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు యజమాన్యం ఒత్తిడి అధికం కావడంవల్ల ఆందోళన చెందుతారు. రుణం కొంత మొత్తం తీర్చడంతో ఒత్తిడి నుంచి కుదుటపడతారు. 
 
మిథునం : కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. కిరాణా ఫ్యాన్సీ, కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు శుభదాకంగా ఉంటుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. సమావేశాలలో పూర్వ మిత్రులను కలుసుకుంటారు. బంధువుల రాకతో ఆకస్మికంగా ఖర్చులు అధికమవుతాయి. 
 
కర్కాటకం : వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలన్నా మీ ధ్యేయం కార్యరూపం దాల్చుతుంది. క్రీడా, కళా, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీకు, బంధువులకు తలెత్తిన కలతలన్నీ దూరమై అంతా కలిసిపోతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. 
 
సింహం : బంధువుల ఆకస్మిక రాక ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆస్తి, భూ వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. విదేశాల్లో ఉన్న ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడతుంది. వైద్యుల తొందరపాటు నిర్ణయాల వల్ల చింతించక తప్పదు. 
 
కన్య : ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామిన మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. మీ లక్ష్యం మంచిదైనా గోప్యంగా ఉంచండి. ఉద్యోగ విరమణ చేసిన వారికి తోటివారు సాదర వీడ్కోలు పలుకుతారు. కుటుంబీకుల ధోరణి మీకు చికాకు కలిగిస్తుంది. 
 
తుల : సన్నిహితుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి వస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సంఘంలో మీకు గౌరవ, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. నిరుద్యోగులు నిర్లప్తత ధోరణి వల్ల సదావకాశాలు జారవిడుచుకుంటారు. పెద్దల ఆరోగ్యంలో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది.
 
వృశ్చికం : విదేశాలు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన బకాయిలు మందు వెనుకలుగానైనా అందువట వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వైద్యులకు ఆపరేషన్ల విషయలో ఏకాగ్రత, మెళకువ అవసరం. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు అనుకూలం. 
 
ధనస్సు : మనష్యుల మనస్తత్వం తెలిసి మసలుకొనుట మంచిది. మీ కుటుంబీకుల మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. స్త్రీలు ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు.
 
మకరం : ప్రముఖల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మిక వాహన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. ట్రాన్స్‌పోర్టు రంగాల్లో వారికి కార్మికుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగ యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. 
 
కుంభం : మాట్లాడలేనిచోట మౌనం వహించండి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
మీనం : ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. సోదరీ, సోదరుల మధ్య అనుబంధాలు బలపడాయి.