శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

29-07-2020 బుధవారం రాశిఫలాలు - స్థిరాస్తికి సంబంధించిన విషయాలు...

మేషం : ఆర్థిక విషయాల్లో సహోద్యోగులు మొహమాట పెట్టే అవకాశం ఉంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. పెద్దల ఆరోగ్యంలో అనుకున్నంత సంతృప్తి ఉండజాలదు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. 
 
వృషభం : పారిశ్రామిక రంగాల వారికి కార్మిక సమస్యలు తలెత్తుతాయి. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు ఆందోళన అధికమవుతుంది. దైవ కార్యాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. కళాశాలలో ప్రవేశాలకు కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుకూల సమయం. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. 
 
మిథునం : హోటల్, తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఒక ఖర్చు నిమిత్తం తెచ్చిన ధనం మరొక అవసరానికి వినియోగిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత, సహనం ఎంతో ముఖ్యం. 
 
కర్కాటకం : ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఆరోగ్యంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు వైద్యులు, ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. 
 
సింహం : టెక్నికల్, సాంకేతిక రంగాలలో వారికి లాభదాయకం. మీ ధ్యేయం నెరవేరాలంటే ఓర్పు, పట్టుదలతో శ్రమించవలసి ఉంటుంది. సినిమా రంగాల్లో వారికి సంతృప్తికానవస్తుంది. శారీరక ఆరోగ్యం నందు కొద్దిపాటి మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. స్త్రీలకు పనిభారం వల్ల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. 
 
కన్య : బంధువుల రాకతో స్త్రీలలో ఉత్సాహం నెలకొంటుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. దైవా, సేవా, పుణ్య కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలలో మెళకువ వహించండి. కంపెనీలకు అవసరమైన నిధులు సేకరణలో ఇబ్బందులు ఎదురవుతాయి. సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. 
 
తుల : కొన్ని వ్యవహారాలు అనుకూలించక పోవడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. వాయిదాపడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయుయత్నాలలో జయం పొందుతారు. దైవ, సేవా, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. 
 
వృశ్చికం : కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పాత మొండి బాకీలు వసూలు అవతాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. 
 
ధనస్సు : నిరుద్యోగులకు చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. వృత్తుల వారికి ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. వాతావారణంలోని మార్పు వ్యవసాయదారులకు ఆందోళన కలిగిస్తుంది. ఎంతో కొంత పొదువు చేద్దామన్న మీ ఆలోచన ఫలించకపోవచ్చు. 
 
మకరం : మీ శ్రీమతి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణాలు అనుకూలించవు. ఏసీ, కూలర్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. ఇతరులకు పెద్ద మొత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. స్త్రీల ఉద్యోగ యత్నం ఫలిస్తుంది. విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీసే ఆస్కారం ఉంది.
 
కుంభం : లౌక్యంగా వ్యవహరించి మీ సమాధానాన్ని దాటవేయండి. ఉద్యోగస్తులు పైఅధికారులతో ఎదుటివారితో మితంగా సంభాషించండం మంచిది. రవాణా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. నూతన దంపతులకు ఎడబాటు, చికాకులు అధికమవుతాయి. 
 
మీనం : పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. ఉపాధ్యాయులు చర్చలు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదాపడతాయి. బంధువుల నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది.