బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 3 జూన్ 2019 (11:55 IST)

03-06-2019 మీ దినఫలాల : అవివాహితులకు త్వరలోనే...

మేషం : కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు ఏమంత సంతృప్తినివ్వజాలవు. పెద్దలతో అవగాహనా లోపం ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టడం వల్ల పనిభారం, విశ్రాంతి లోపం ఎదుర్కొంటారు. వ్యాపారాభివృద్ధికే నూతన పథకాలు ప్రణాళికలు రూపొందిస్తారు. ఖర్చులు అధికమైన సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటుంది.
 
వృషభం : ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటుతనం విడనాడండి. అవివాహితులకు త్వరలోనే దూరప్రాంతాల నుండి సంబంధాలు ఖాయమవుతాయి. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. బంధువుల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి.
 
మిథునం : మిత్రులతో సంబంధ బాంధ్యవ్యాలు మరింత బలపడతాయి. బదిలీలు మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో మెళకువ అవసరం. దూర ప్రయాణాలలో చికాకులు, ఇబ్బందులు తప్పవు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంతముందు వెనుకలుగానైనా పూర్తిగా అందుతుంది.
 
కర్కాటకం : విద్యుత్, ఏసీ, కూలర్ మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. చిన్న చిన్న విషయాలపై కూడా శ్రద్ధ పెట్టండి. వ్యాపారస్తులు, భాగస్వామ్య ఒప్పందాలు, కాంట్రాక్టుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. బ్యాంకింగ్ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
సింహం : గృహంలో విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. హామీలు, ఇతరులకు ధనసహాయం చేసే విషంలో పునరాలోచన చాలా అవసరం. ఆత్మ విశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ ధైర్యసాహసాలకు, కార్యదీక్షతకు మంచి గుర్తింపు గౌరవం లభిస్తాయి. వస్త్ర, బంగారు వెండి, రంగాల వల్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కన్య : మెడికల్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వాక్‌చాతుర్యానికి అనుకూలంగా ఉండగలదు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. ప్రేమ వ్యవహారాలలో విజయం పొందడానికి మరికాస్త కృషి చేయాలి. కుటుంబీకుల నిర్లక్ష్యం వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది.
 
తుల : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. చేపట్టిన పనులలో నెమ్మదిగా మార్పులు సంభవిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు తప్పవు. కపటంలేని మీ ఆలోచనలు సలహాలు మీకు అభిమానులను సంపాదించి పెడుతుంది.
 
వృశ్చికం : ముఖ్యుల రాకపోకలు అనుకోని ఖర్చుల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకెంతో శుభం చేకూరుతుందని గమనించండి. కుటుంబంలో ఒక శుభకార్యం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరికీ ఆకట్టుకుంటారు.
 
ధనస్సు : రియల్ ఎస్టేట్ రంగాల వారికి కలిసివచ్చేకాలం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. సోదరీసోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారిక పర్యటనలు, బాధ్యతలు అధికమవుతాయి. నిర్మాణ పనులలో సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది.
 
మకరం : ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వృత్తుల వారికి పురోభివృద్ధి, గుర్తింపు సదావకాశాలు లభిస్తాయి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. కార్యసిద్ధిలో అనుకూలత, చేపట్టిన పనులు వేగవంతమవుతాయి.
 
కుంభం : గృహంలో పనులు వాయిదాపడతాయి. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. కుటుంబీకులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు.
 
మీనం : తలపెట్టిన పనులు నిర్వఘ్నంగా పూర్తిచేస్తారు. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి. ఉన్నతస్థాయి ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్ఫం నెరవేరుతుంది. ప్రేమికులకు ఎడబాటు, ఊహించని చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది.