గురువారం, 14 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (22:51 IST)

ఇంటి ముఖద్వారంపై గుమ్మడి కాయ కట్టేటపుడు ఏ మంత్రం చదవాలో తెలుసా?

gummadi kaaya
మంచి గుమ్మడి కాయలో చరకిదేవతా, బూడిద గుమ్మడిలో విదారి దేవతా నివశించి వుంటారు. ఈ దేవతలు యజమాని యొక్క కష్టనష్టాలను తొలగించు స్వభావం కలవారు. గ్రహ స్వరూపంతో కూడిన పిశాచాదులు తొలగించి రక్షించువారు క్షౌమండాండరమున్నగు దేవతలను తునుమువారు.

 
అందువల్ల గృహారంభంలో, గృహ ప్రవేశములో పసుపు-కుంకుమతో కూడిన మంచిగుమ్మడిని పగులగొట్టాలి. బూడిద గుమ్మడిని ద్వారానికి కట్టాలి అనేది ఆచారంగా వస్తున్నది. గుమ్మడికాయ కొట్టేటపుడు కానీ కట్టేటపుడు కానీ ఈ క్రింద తెలిపిన మంత్రాన్ని మూడుసార్లు చదువుతూ ఆ పనిచేయాలి.

 
హే కూష్మాండ దేవతా... ఇయం గృహేశాకిన్యాదిదేవాః
పరయంత్ర పరతంత్రాది సర్వదోషాన్ నివృత్తయ నివృత్తయ
గృహే సర్వకార్యాదీన్ రక్షరక్ష హోంఫట్ స్వాహా