Daily Horoscope
✕

ఇంట్లో నలుపు, ఎరుపు రంగు చేపల్ని పెంచితే? (Video)

Written By సెల్వి
Updated: బుధవారం, 22 జనవరి 2020 (17:09 IST)
దృష్టి దోషాలను తొలగించుకోవాలంటే.. ఈ పద్ధతులను పాటించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. శుభకార్యాల్లో అరటి చెట్లను ఇంటి ముందు వుంచడం చూస్తుంటాం. అరటి పువ్వులు కాయలతో కూడిన అరటి చెట్లకు దృష్టి దోషాలను లాగేసుకునే శక్తి వుంటుందట.

అందుకే శుభకార్యాల్లో అరటి చెట్లను ఇంటి ముందు కడుతారని విశ్వాసం. ఇంటికి వచ్చే కొందరి దృష్టి సరిగ్గా వుండకపోవచ్చు. వారి ఆలోచనలు ప్రతికూలంగా వుండవచ్చు. అలాంటి వాటితో ఉత్పన్నం అయ్యే సమస్యలను తొలగించుకునేందుకు అరటి చెట్లను ఇంటి ముందు వుంచుతారు. 
 
ఇలాగే దృష్టి దోషాలను తొలగించుకోవాలంటే.. గృహంలో చేపల తొట్టెను వుంచడం చేయొచ్చు. అందులో నలుపు, ఎరుపు రంగు చేపలను పెంచడం చేయొచ్చు. కంటి దృష్టికి చెక్ పెట్టాలంటే.. ఇంట్లో సునితమైన మంగళవాద్యాల శబ్ధాన్ని ఎప్పుడూ వినిపించేలా చేయొచ్చు. కంటి దృష్టిని పోగొట్టే వినాయకుని బొమ్మను వుంచవచ్చు. ఇంకా ఇంటికి ప్రధాన ద్వారం వద్ద కలబంద, బ్రహ్మజెముడు మొక్కలను వేలాడదీయడం చేయొచ్చు. 
 
అలాగే ఈ చెట్లను ఇంటి ముందు పెంచడం ద్వారా దృష్టి లోపాలుండవు. వారానికి ఓసారి ఉప్పు నీటితో స్నానం చేయడం మంచిది. ఇంటిని కూడా ఉప్పు, పసుపు నీటితో కలిపి శుభ్రం చేయడం ద్వారా ప్రతికూల ఫలితాలు దూరమవుతాయి. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం మరిచిపోకూడదు.

సాంబ్రాణి వేసేటప్పుడు తెలుపు ఆవాలను మరిచిపోకూడదు. తెలుపు ఆవాలతో సాంబ్రాణి వేయడం ద్వారా వ్యాపారాభివృద్ధి వుంటుంది. ఇంకా ఇంట అష్టైశ్వర్యాలు తులతూగుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
 

అన్నీ చూడండి

మహిళపై కూడా గ్యాంగ్ రేప్ కేసు పెట్టొచ్చు : ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

అక్టోబర్ 16, 2026 : తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

హైదరాబాద్‌లో నవరాత్రి అన్నప్రసాద స్థలంపై చేపల వ్యర్థాలను పారవేసిన ముస్లిం మహిళ అరెస్టు

వేగా జ్యూవెలర్స్ ఆధ్వర్యంలో 'రాగ దాండియా ఉత్సవ్' : ఎండీ నవీన్ వనమా

వివాహేతర సంబంధం... భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

అన్నీ చూడండి

16-10-2026 శుక్రవారం నాటి రాశి ఫలాలు - ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు...?

కనకదుర్గమ్మకు రూ.75లక్షల బంగారు కిరీటం.. ఎస్వీ గో-సంరక్షణ కేంద్రానికి ఐదు గోవులు

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. గరుడ సేవ.. టూవీలర్స్‌పై నిషేధం

నవరాత్రులు 2026: నవరాత్రుల్లో శ్రీ దుర్గా మంత్రాన్ని ఏ వేళలో పఠించాలంటే?

15-10-2026 గురువారం నాటి రాశి ఫలాలు.. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది...

తర్వాతి కథనం
Show comments