చెట్టినాడ్ ఫిష్ ఫ్రై తయారీ విధానం...
కావలసినవి:
చేప ముక్కలు - నాలుగు
నూనె - తగినంత
వెల్లుల్లి రెబ్బలు - ఏడు
అల్లం ముక్క - చిన్నది
జీలకర్ర - టీస్పూన్
సోంపు - టీస్పూన్
ధనియాలు - రెండు టీస్పూన్లు
నల్లమిరియాలు - రెండు టీస్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
కరివేపాకు - కొద్దిగా
ఉప్పు - తగినంత
టొమాటో - ఒకటి
కారం - టీస్పూన్
పసుపు - రెండు టీస్పూన్లు
చింతపండు - కొద్దిగా
మొక్కజొన్న పిండి - టేబుల్‌స్పూన్
తయారీ:
ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడగాలి. ఒక పాన్‌లో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, సోంపు, ధనియాలు, మిరియాలు, ఆవాలు, కరివేపాకు వేసి వేగించాలి. కొద్దిగా ఉప్పు, టొమాటో ముక్కలు వేయాలి. పసుపు, కారం వేసి తర్వాత చింతపండు రసం పోయాలి. ఈ మిశ్రమాన్ని చేప ముక్కలపై పోయాలి. తర్వాత మొక్కజొన్న పిండి చల్లుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలను పావుగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తరువాత మరొక పాన్‌లో నూనె వేసి చేప ముక్కలను వేగించాలి. నిమ్మరసం పండుకొని వేడి వేడిగా తింటే రుచికరంగా ఉంటాయి.