సండే స్పెషల్ వంటకం... చికెన్ లెగ్ పీసెస్‌తో...

సిహెచ్|
చికెన్ లెగ్ పీస్ లు తీసుకుని వాటితో టేస్టీగా వుండే చికెన్ కబాబ్ చేస్తే ఈ సండే సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు :
చికెన్ తొడలు- నాలుగు
వెనిగర్- రెండు టీస్పూన్లు
పచ్చిమిర్చి- పది
అల్లంముద్ద- ఒక టీస్పూను
వెల్లుల్లిముద్ద- ఒక టీస్పూను
పెరుగు- 300 గ్రాములు
గరంమసాలా పొడి- ఒక టీస్పూను
నూనె- రెండు టీస్పూన్లు
కొత్తిమీర- ఒక కట్ట
పుదీనా ఆకు రెమ్మలు- కొద్దిగా
ఉప్పు- సరిపడా
చాట్ మసాలా పొడి- ఒక టీస్పూను
పసుపు- కొంచెం

తయారీ విధానం :
కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా ఆకులు అన్నీ కలిపి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. నాలుగు చికెన్ తొడలకు చాకుతో లోతుగా గంట్లు పెట్టి వెనిగర్ ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్దని బాగా పట్టించి పావుగంటసేపు నానబెట్టుకోవాలి. పెరుగు బాగా చిలికి ఉప్పు, గరం మసాలా పొడి, నూనె వేసి బాగా డైల్యూట్ చేసి చికెన్ ముక్కలను అందులో వేసి ఆరుగంటలపాటు ఊరనివ్వాలి.

తరువాత చికెన్ ముక్కల్ని బొగ్గుల సెగమీద దోరగా కాల్చాలి. ఆపై వీటిని ఒక ప్లేటులో పెట్టి చాట్ మసాలా పొడి చల్లి, ఉల్లిపాయ చక్రాలూ నిమ్మ డిప్పలతో అందంగా అలంకరించి అతిథులకు వడ్డించాలి. ఈ చికెన్ కబాబ్‌లను వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.దీనిపై మరింత చదవండి :