శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 24 అక్టోబరు 2018 (11:35 IST)

బ్రకోలితో జ్ఞాపకశక్తి మెరుగు...

మెదడు పనితీరు ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. మెదడు మన శరీరంలో ఒక భాగం. కనుక అది ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.. అవకాడోలోని విటమిన్స్, మినరల్స్ జ్ఞాపకశక్తిని పెంచుటకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అవకాడోను ఉడికించుకును గుజ్జులా తయారుచేసి అందులో కొద్దిగా చక్కెర కలిపి ప్రతిరోజూ సేవిస్తే మానసిక ఒత్తిడి, ఆందోళన తొలగిపోతుంది.
 
చేపలంటేనే గుర్తుకు వచ్చేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. చేపలలో ఈ పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. చేపలు తీసుకుంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. దాంతో జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. చేపలను వేపుడుగా కాకుండా కూర రూపంలో తీసుకుంటే వాటిలోని పోషక విలువలు శరీరానికి అందుతాయి. బ్రకోలిలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. బ్రకోలి ఆలోచనా శక్తిని పెంచుతుంది. దీనిలోని కొలైన్ అనే అత్యవసర పోషకం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
 
కొందరికి వాల్‌నట్స్ అసలు పడవు. మరి ఎందుకో తెలియదు. వాల్‌నట్స్‌లోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఇవి నచ్చని వారు కూడా ఇష్టపడి తింటారు. అంటే.. బాదం, జీడిపప్పు, పిస్తాపప్పు, వాల్‌నట్స్‌లోని, మినరల్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మెదడును ఉత్సాహంగా చేస్తాయి. వీటిని రోజు క్రమంగా తప్పకుండా తీసుకుంటే అధిక బరువు కూడా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.