శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : సోమవారం, 8 అక్టోబరు 2018 (14:03 IST)

డైనింగ్ టేబుల్‌పై ఉప్పును వుంచడం మరవకండి... ఎందుకంటే?

నివాసంతో పాటు పరిసరాల్లో ప్రతికూల శక్తులు వుండకూడదని అందరూ భావిస్తుంటారు. గృహంతో పాటు కార్యాలయాల్లో ప్రతికూల ప్రభావాలుంటే.. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అంతేగాకుండా ప్రతికూల ప్రభావంతో ఇంట్లో దారిద్ర్యం

నివాసంతో పాటు పరిసరాల్లో ప్రతికూల శక్తులు వుండకూడదని అందరూ భావిస్తుంటారు. గృహంతో పాటు కార్యాలయాల్లో ప్రతికూల ప్రభావాలుంటే.. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అంతేగాకుండా ప్రతికూల ప్రభావంతో ఇంట్లో దారిద్ర్యం తప్పదు. అందుకే ప్రతికూల ప్రభావంతో పాటు దారిద్ర్యాన్ని పోగొట్టుకోవాలంటే.. ఉప్పును ఉపయోగించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
ఉప్పును ఉపయోగించడం ద్వారా ప్రతికూల ప్రభావంతో పాటు దుష్టశక్తులు కూడా ఇంటి నుంచి పారిపోతాయని వారు చెప్తున్నారు. ఆదివారాల్లో సీసాల్ట్‌ను నీటిలో కలిపి.. దాన్ని ఇంటిల్లా పాది చల్లాలి. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. 
 
అలాగే ఒక గ్లాసుడు నీటిలో ఉప్పు చేర్చి ఇంటికి నైరుతి దిశలో వుంచాలి. ఇలా వుంచితే ఇంట్లో దారిద్ర్యం తొలగిపోతుంది. ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది. ఈ నీటిని ప్రతిరోజూ లేదా రోజు మార్చి రోజు మారుస్తూ వుండాలి. అలాగే ఓ బౌల్‌లో గుప్పెడు రాళ్ల ఉప్పును తీసుకుని.. ఆ బౌల్‌ను స్నానపు గదిలోని ఓ మూలలో వుంచాలి. ఈ ఉప్పును వారానికి ఓసారి లేదా రెండు రోజులకు ఓసారి మార్చడం మరిచిపోకూడదు. 
 
ఇంకా ఎరుపు రంగు వస్త్రంలో ఉప్పును కట్టి.. దాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి నేరుగా వేలాడేలా కట్టాలి. ఇది ఇంట్లోని దుశక్తులను దూరం చేస్తుంది. పాజిటివ్ శక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇకపోతే.. ఆహారం తీసుకునే డైనింగ్ టేబుల్‌పై ఉప్పు వుంచడం ద్వారా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. 
 
ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది. ఇంకా స్నానం చేసే నీటిలో ఓ గుప్పెడు ఉప్పును వేసి.. పది నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయడం ద్వారా చర్మానికే మేలు జరుగుతుంది. అలాగే దృష్టి లోపాలు తొలగిపోతాయని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు.