ఇంటి నిర్మాణానికి ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే..?
కొందరికి ఇంటిని ఏ దిశలలో ఏ దిక్కులలో కట్టుకోవాలో తెలియదు. అందుకు వారికి తెలిసిన వారినందరినీ అడుగుతుంటారు. అయినా కూడా ఏ మాత్రం అర్థకావడం లేదని సతమతమవుతుంటారు. ఇంటి నిర్మాణాన్ని ఏ దిశలో కట్టుకుంటే మంచిదో.. దాన్ని ఎలా నిర్మించాలో తెలుసుకుందాం. ఇళ్ళు కట్టుకునేటప్పుడు ఇంటి ఎత్తు మాత్రం రోడ్డుకు పైఎత్తున ఉండాలి.
రోడ్లు ఎత్తు, పల్లంగా ఉన్న స్థలాల నుండి ఇంటి బేస్‌మెంట్ ఎక్కువగా పెట్టుకోవాలి. ఒకవేళ మీ రోడ్డు ఎత్తుగా ఉంటే.. ఇలా కూడా చేయవచ్చు.. అంటే ఆగ్నేయంలో ఎత్తుగా ఉంటే అక్కడ రోడ్డుకంటే ఇంటి ఫ్లోరింగ్ మాత్రం రెండు అడుగులు ఎత్తు వచ్చేలా కట్టుకోవాలి. అప్పుడే ఈశాన్యంలో నాలుగు అడుగుల వరకు బేస్‌మెంట్ పెరుగుతుంది. అలానే ఈశాన్య దిశలో రోడ్డు ఎత్తుగా ఉంటే బేస్‌మెంట్ రెండున్నర అడుగులు ఎత్తుగా ఉండేలా కట్టుకోవాలి.