గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (12:23 IST)

వినాయకుడి విగ్రహం కొంటున్నారా?

వినాయకుడి విగ్రహం కొంటున్నారా..? అయితే తప్పక ఎలుక వుండాలి. విగ్రహమైనా, పటమైనా ఎలుకలేని వినాయకుడిని పూజించకూడదు. అలాగే వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన గరికతో ఆయన్ని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగ

వినాయకుడి విగ్రహం కొంటున్నారా..? అయితే తప్పక ఎలుక వుండాలి. విగ్రహమైనా, పటమైనా ఎలుకలేని వినాయకుడిని పూజించకూడదు. అలాగే వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన గరికతో ఆయన్ని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. నిలబడి వున్న వినాయక పటాన్ని కార్యాయాల్లో వుంచితే లాభాలుంటాయి. పాజిటివ్ ఎనర్జీని పొందవచ్చు. 
 
కార్యాలయాల్లో పనిచేసేవారిలో ఉత్సాహం పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. కూర్చుని ఉన్న వినాయకుణ్ణి పూజిస్తే గణపతి తొండం అయన ఎడమ చేతి వైపు ఉన్న విగ్రహాన్ని పెట్టుకోవాలి. అదృష్టంతో పాటు విజయం కూడా మీ సొంతం అవుతుంది. 
 
తెలుపు రంగు వినాయకుడిని పూజిస్తే ఆ ఇంట ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది. అంతేగాకుండా.. సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఎరుపు లేదా కాషాయం రంగు విగ్రహాన్ని పూజిస్తే అభివృద్ధి, సంపద పెరుగుతుంది.