శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Kowsalya
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (13:23 IST)

మష్రూమ్ ఎగ్‌రైస్ తయారీ విధానం..

కావలసిన పదార్థాలు: అన్నం - 1 కప్పు ఉల్లిపాయలు - అరకప్పు అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ పుట్టగొడుగులు - అరకప్పు టమోటా - 1 గుడ్డు - 1 కొత్తిమీర - అరకప్పు కారం - 2 స్పూన్స్ పచ్చిమిర్చి - 3 నిమ్మరసం -

కావలసిన పదార్థాలు:
అన్నం - 1 కప్పు
ఉల్లిపాయలు - అరకప్పు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
పుట్టగొడుగులు - అరకప్పు
టమోటా - 1
గుడ్డు - 1
కొత్తిమీర - అరకప్పు
కారం - 2 స్పూన్స్
పచ్చిమిర్చి - 3
నిమ్మరసం - కొద్దిగా
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకుని ఆ తరువాత పుట్టగొడుగులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఆ తరువాత కారం, జీరా, ధనియాల పొడి, చాట్ మసాల, ఉప్పు, కొత్తిమీర వేసి 3 నిమిషాల పాటు వేయించి గుడ్డుసొన వేసి మరికాసేపు బాగా వేయించాలి. చివరగా ఈ మిశ్రమంలో అన్నం కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే వేడివేడి మష్రూమ్ ఎగ్‌రైస్ రెడీ.