మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: శుక్రవారం, 28 డిశెంబరు 2018 (20:17 IST)

సింహ రాశి 2019, తొందరపడవద్దు...(Video)

సింహరాశి: ఈ రాశివారికి నవంబర్ 4వ తేదీ వరకు చతుర్థము నందు బృహస్పతి ఆ తదుపరి అంతా పంచమము నందు, 2020 ఫిబ్రవరి వరకు పంచమము నందు శని, ఆ తదుపరి అంతా షష్ఠమము నందు, ఈ సంవత్సరం అంతా పంచమను నందు కేతువు, లాభము నందు రాహువు సంచరిస్తారు.
 
ఈ సంవత్సరం మీ గోచారం పరిశీలించగా... తొందపడి ఏ పనీ చేయకూడదు. అలా చేయడం వలన దుష్పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో గానీ, సంతాన విషయంలో గానీ చక్కని అభివృద్ధి కానవస్తుంది. బంధువుల రాకపోకలు కొన్ని వ్యవహారాలు సానుకూలం చేసుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకున్నంత పురోభివృద్ధి లేనప్పటికీ క్రమక్రమంగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు తీరటానికి, పాత సమస్యలు తీరటానికి అహర్నశలు శ్రమిస్తారు. ఖర్చులకు తగిన ఆదాయం అందుతుంది. ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. అధిక శ్రమ ఒత్తిడి కారణంగా ఆరాగ్యంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు మాత్రం కానవస్తున్నాయి. 
 
ఉద్యోగ వ్యవహారాల యందు ఇతరుల సహాయం అందుకుంటారు. ప్రమోషన్ యత్నాలు చేయకుండానే అనుకూలంగా ఫలితాలు మీకు ఫలితాలు అందుతాయి. అలానే మీకు అధికారులు, తోటి సహకారం చాలా గొప్పగా ఉంటాయి. నూతన ఆలోచనలు క్రియారూపంలో పెట్టండి. వ్యాపార విషయములతో కూడా మీ ఆలోచనలు బాగా చక్కగా అమలుచేస్తారు. వ్యాపారాలు విస్తరించే యత్నాలు చేస్తారు. హడావుడిగా పనులు సాగుతాయి. విద్యార్థులకు ఎక్కువ శ్రమతో మంచి ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఇతరుల సలహాలు, సూచనలు మీకు చక్కగా పనిచేస్తాయి. విదేశీయాన యత్నాలు సానుకూలం అవుతాయి. 
 
రైతులు వాతావరణానికి తగ్గ పంటలు పండించిగలుగుతారు. రైతులకు చక్కటి సహకారం అన్ని విషయాల్లోనూ అందుతుంది. నిర్మాణ పనుల్లో ఏమాత్రం ముందుకు సాగక విసుగు చెందుతారు. పనివారితో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. కోర్టు వ్యవహారాల్లో పురోగతి కానవస్తుంది. ముఖ్యుల కలయిక కుదదు. కంజ్యూర్, నిత్యవసర వస్తు, వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. ఎండుమిర్చి, ప్రత్తి, మినుములు పంటలు బాగా పండుతాయి. ఎక్స్‌పోర్ట్ వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో అలసత్వం ఎదుర్కుంటారు. 
 
వస్త్రం, బంగారం, వెండి రంగాల్లో వారికి శ్రమాధిక్యత ఉన్నప్పటికి సత్ఫలితాలు కానరాగలవు. ఇతరుల విషయాల్లో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి. అవివాహితుల్లో నూతనోత్సాహం కానరాగలదు. అవివాహితులకు కోరుకున్న సంబంధాలు నిశ్చయం కాగలవు. సినీ, కళా రంగాల్లో సదవకాశాలు లభిస్తాయి. తీర్థయాత్రలు, దైవకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విరివిగా దైవకార్యక్రమాలకు విరాళాలు అందిస్తారు. దైవకార్యాల్లో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత, అభివృద్ధి కానవస్తుంది. నిరుద్యోగుల యత్నాలు కలిసిరాగలవు. ఏదైనా సొంతంగా ప్రారంభించనప్పడికి సఫలీకృతులవుతారు. ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్న యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. రాజకీయాల్లో వారు మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. విరోధులను ఒక కంట కనిపెట్టుకుని ఉండడం మంచిదని గ్రహించండి. 
 
* ఈ రాశివారు గోపూజతో పాటు ఆదిత్యుని ఎర్రని పూలతో పూజించిన కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, అభివృద్ధి కానవస్తుంది.
* మఖ నక్షత్రం వారు మర్రి, పుబ్బ నక్షత్రం వారు మోదుగ, ఉత్తరా నక్షత్రం వారు జువ్వి మొక్కను దేవాలయాలలో కానీ విద్యా సంస్థలలో కానీ, ఖాళీ ప్రదేశాలలో నాటిన శుభం కలుగుతుంది.
* మఖనక్షత్రం వారు కృష్టవైఢూర్య, పుబ్బ నక్షత్రం వారు వజ్రం, ఉత్తర నక్షత్రం వారు జాతికెంపు ధరించిన శుభం కలుగుతుంది.
సింహ రాశి ఫలితాలు... వీడియో చూడండి...