శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (19:37 IST)

రాత్రిపూట బల్లిపడితే ఎలాంటి ఫలితం లేదట.. చేతులపై బల్లిపడితే? (video)

బల్లి శరీరంపై పడితే వెంటనే స్నానం చేయాలి. దేవునికి దీపం వెలిగించి మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి. పంచగవ్యం అంటే (ఆవు నెయ్యి, పాలు, పెరుగు, గోమూత్రము, గోవు పేడను కలిపిన మిశ్రమం)ను ఆలయంలో ఇవ్వడం చేస్తే ప్రతికూల ఫలితాలు వుండవు. కాంచీపురంలోని వరదరాజు పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించడం చేయాలి. 
 
అలాగే ఆ ఆలయంలోని బంగారు బల్లి, వెండి బల్లి, సూర్యుడు,చంద్ర చిత్రాలతో పాటు పైకప్పుపై, గర్భగుడి వెనుక చూడటం దోషాలను తొలగించుకోవచ్చు. బంగారు, వెండి బల్లులను తాకినప్పుడు గతంలో, భవిష్యత్తులో బల్లులు పడటం వలన కలిగే అన్ని చెడు ప్రభావాలను లేదా దోషాలను తొలగిపోతుందని నమ్మకం. 
 
పురుషుడి శరీరంలోని కుడి భాగంపై బల్లి పడితే శుభం కలుగుతుందని, మహిళకు మాత్రం ఎడమ భాగంపై పడితే శుభాలు కలుగుతాయని చెబుతారు. అదే సమయంలో పురుషుడి ఎడమ భాగంపైన, స్త్రీ కుడి భాగంపై బల్లి పడితే అశుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు.

రాత్రిపూట బల్లి పడితే మాత్రం ఏ విధమైన ఫలితాలు ఉంవని చెబుతారు. ముఖంపై బల్లిపడితే.. అనూహ్యంగా ఆస్తులు వచ్చి చేరుతాయి. ఎడమ కన్ను- శుభవార్త వింటారు. చేతులపై బల్లిపడితే ఆర్థిక ఆదాయం వుంటుందని బల్లిశాస్త్రం చెప్తోంది.