పడుకునే సమయంలో అది మాత్రం చేయకుండా వుండను.... కాజల్ అగర్వాల్

Kajal Agarwal
జె| Last Modified బుధవారం, 31 జులై 2019 (17:59 IST)
కాజల్ అగర్వాల్ తెలుగులోనే కాదు తమిళ భాషలోనూ అగ్ర హీరోయినే. హిందీలోనే అడపాదడాపా నటిస్తూ వస్తున్న కాజల్ అగర్వాల్‌కు దక్షిణాధి రాష్ట్రాల్లో లక్షలాదిమంది ఫ్యాన్సే ఉన్నారు. అయితే గత కొన్నినెలల నుంచి కాజల్ అగర్వాల్ గ్యాప్ లేకుండా నటిస్తూనే ఉంది. అస్సలు విరామం లేకుండా నటిస్తున్నానని ఆమె చెబుతోంది.

ఒక చిన్న సినిమాతో నా కెరీర్ ప్రారంభించా. అప్పటి నుంచి ఇప్పటి వరకు విరామం లేకుండా నాకు డైరెక్టర్లు ఛాన్సులిస్తున్నారు. సినిమాల్లో నాకు అవకాశాలు రావడానికి కూడా నేను నిరంతరం పనిచేయడమేనంటోంది కాజల్.

యువ హీరోల నుంచి అగ్రహీరోల వరకు అందరితోను నటించాను. ఎన్నో క్యారెక్టర్లు చేశాను. ఈ క్యారెక్టరే చేయాలన్న ఆలోచన ఏ మాత్రం లేదు. ఎందుకంటే అన్ని క్యారెక్టర్లలో నటించేశాను కాబట్టి. అయితే విరామం దొరకపోయినా పడుకునే సమయంలో మాత్రం ఖచ్చితంగా కొద్దిసేపు న్యూస్ ఛానెల్స్ చూడడం మాత్రం మాననంటోంది కాజల్. ఎందుకంటే సమాజంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి..అది ముఖ్యమంటోంది కాజల్ అగర్వాల్.దీనిపై మరింత చదవండి :