బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (15:49 IST)

గంగానది అమృతంగా మారే మౌని అమావాస్య గురించి తెలుసా?

మౌని అమావాస్య ఫిబ్రవరి నాలుగో తేదీన వస్తోంది. అదీ సోమవారం పూట మౌని అమావాస్య రానుంది. మౌని అమావాస్య తిథి ఫిబ్రవరి మూడో తేదీ ఆదివారం రాత్రి 10.52 నుంచి ఫిబ్రవరి ఐదే తేదీ ఉదయం 02.33 గంటలకు ముగియనుంది. గంగానదిలో స్నానమాచరించేందుకు మౌని అమావాస్య ఉత్తమమైనది. ఈ  రోజున గంగానదీ స్నానమాచరించే వారికి సకల పాపాలు తొలగిపోతాయి. 
 
మౌని అమావాస్య రోజున గంగానది అమృతంగా మారుతుందట. మాఘ మాసంలో వచ్చే ఈ అమావాస్యను ఉత్తరాదిన మాఘి అమావాస్యగా పిలుస్తారు. మాఘ అమావాస్య రోజున గంగాస్నానం ఆచరించేవారికి పుణ్యఫలితాలుంటాయి. 
 
ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళా ఉత్సవాలు ఈ ఏడాది జరుగనున్నాయి. ఇందులో భాగంగా మౌని అమావాస్యను పురస్కరించుకుని ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రయాగ్, అలహాబాద్ ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తుల కోసం యోగి సర్కారు అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. 
 
అలాగే మాఘమాసంలో వచ్చే ఈ మౌని అమావాస్య రోజున మౌనంగా వుండే మౌనవ్రతాన్ని ఆచరించాలి. ఈ అమావాస్య రోజున మౌనవ్రతం పాటిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. రోజంతా మౌనంగా వుండకపోయినా.. సూర్యోదయం తర్వాత మౌన అమావాస్య కోసం కాసేపు అలా మాట్లాడకుండా వుండటం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ అమావాస్య పాప గ్రహాల శాంతి కోసం వస్తుంది.
 
ఈ రోజున రోజంతా మౌనవ్రతం చేయలేని వారు తెల్లని కాగితం తీసుకుని.. దానిపై తులసీ లేదా పసుపు కొమ్మతో మీ కోరికను రాయండి. దానిని మీ అరచేతుల్లో పెట్టుకుని.. దానినే కళ్లార్పకుండా చూడండి. ఎంతసేపు చూడగలిగితే అప్పటిదాకా చూడాలి.
 
కళ్లార్పే సమయం వచ్చినప్పుడు ఓ ప్రకృతి మాతా.. నా ఈ కోరిక తీర్చు అని కోరాలి. మౌనంగా వుండి ఇలా కోరి.. ఆ కాగితంపై వూది మడిచేసి.. పూజా మందిరంలో ఏ దేవుని పటం వెనుకనైనా వుంచాలి. అంతే మీ కోరిక నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు. తప్పకుండా అద్భుతం జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
మరోవైపు మౌని అమావాస్య సందర్భంగా అహ్మదాబాద్‌లో ప్రజలు పుణ్యస్నానాలు చేశారు. తెల్లవారుజామునే నదీ తీరానికి చేరుకున్న ప్రజలు.. పుణ్యస్నానాలు చేశారు. మాఘమాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజు గంగాస్నానం, మౌనవ్రతంలో ఉండటంతో పాటు.. ఈ రోజు ధానధర్మాలు చేస్తే చాలా ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి.
 
పితృపూజ చేయటానికి మౌని అమావాస్య మంచిరోజు. ఈ సందర్భంలో పూర్వీకులను గుర్తు చేసుకుని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ.. వారి ఆశీర్వాదాలను పొందవచ్చు. శనీశ్వరుని మౌని అమావాస్య రోజున పూజ చేయొచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.