శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (13:52 IST)

స్త్రీకి ముక్కు భాగంలో ఎర్రని పుట్టుమచ్చ ఉన్నచో..?

ఇంతిముక్కుతుదను యెఱ్ఱని యొకమచ్చ
గల్గేనేని రాజకాంతయగును..
అదియు నల్లనైన హరియించు భర్తను 
గాకయున్న వేళ్యకాంతయగును.
 
స్త్రీకి ముక్కు చివరభాగాన మచ్చ ఉన్నచో తలచిన కార్యములు ఎవరు అడ్డువచ్చినను చేసి తీరుతారు. ముక్కునుకు సమీపమున నుండు మచ్చలు కూడ ఈ ఫలితాలనే కలుగజేయును. ముక్కు చివరి భాగంలో ఎర్రని పుట్టుమచ్చ ఉన్నచో విధవయగును లేదా జారిణియగును.
 
కంఠేచ పార్శ్వయోర్వాసి తిలకాకృతి చిహ్నకే
ప్రథమప్రసవే పుత్రం ప్రాప్నుయా న్నాత్ర సంశయః..
 
స్త్రీకి కంఠమునందు గాని, పిక్కలందుగాని తిలకా కారంలో పుట్టుమచ్చ ఉన్నచో ఆ స్త్రీకి మొదట పుత్రసంతానం కలుగును. ఆ మచ్చ ఎడమ భాగంలో ఉన్నచో సకలసంపదలు చేకూరును. కుడిభాగమునందు ఉన్నచో సామాన్య జీవితమును కలిగియుండును. మరియు ఈ ఫలితాలు వాటి రంగు ననుసరించి చెప్పవలయును.