మకర సంక్రాంతి- 12 రాశులు చేయాల్సిన దానాలు.. గంగమ్మ భువిపైకి?
జనవరి 14వ తేదీన మంగళవారం నాడు మకర సంక్రాంతి పండుగ వచ్చింది. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ మూడు రోజుల పాటు కోనసీమలో కోడి పందేలు జోరుగా కొనసాగుతాయి.
తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భువిపైకి ఆహ్వానిస్తాడు. తన ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున భువిపైకి వస్తుంది. అందుకే ఈరోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.
ఈ ఏడాది 14వ తేదీన సంక్రాంతి పండుగను జరుపుకోనున్నాం. రాశులను బట్టి కొన్ని వంటకాలను, వస్తువులను దానం చేయడం ద్వారా మేలు జరుగుతుంది. మేష రాశిలో జన్మించిన వాళ్లు సంక్రాంతి రోజున పప్పులు, బెల్లం, నువ్వులు దానంగా ఇవ్వాలి.
వృషభ రాశిలో జన్మించిన వాళ్లు వస్త్రాలను దానం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వాళ్లు నువ్వుల లడ్డూను దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయి. కర్కాటక రాశి వాళ్లు పండగ రోజున తిలదానంను దానం చేస్తే మంచిదని చెప్పవచ్చు.
సింహరాశిలో జన్మించిన వాళ్లు బెల్లం లడ్డూ, నువ్వుల లడ్డూలను రాగి పాత్రలో దానంగా ఇవ్వాలి. కన్యారాశిలో పుట్టిన వాళ్లు కిచిడీ దానం చేయాలి. తులారాశి వాళ్లు పాలు, పెరుగు, నెయ్యి, వెన్నె దానం చేస్తే మంచిది. తుల రాశిలో జన్మించిన వాళ్లు నువ్వుల లడ్డూను దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయి.
వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్లు పప్పు కిచిడీని దానం చేయడం ద్వారా కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ధనస్సు రాశిలో పుట్టిన వాళ్లు పసుపు చందనం, బెల్లం లడ్డూలు నువ్వులను దానం చేయాలి.
మకరరాశికి శని అధిపతి కాగా నల్ల నువ్వుల లడ్డూను, ఆవనూనెను దానం చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం కలుగుతుంది. కుంభరాశికి కూడా శని అధిపతి కాగా ఈ రాశిలో జన్మించిన వాళ్లు నువ్వుల లడ్డూలను దానంగా ఇవ్వాలి. మీన రాశి వాళ్లు బొప్పాయి, శనగపప్పులను దానం చేస్తే శుభ ఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది.