Daily Horoscope
✕

మార్గశిర పంచమి.. వారాహి దేవికి పంచముఖం దీపం వెలిగిస్తే?

Written By సెల్వి
Updated: సోమవారం, 12 డిశెంబరు 2022 (11:57 IST)
మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని తులసి ఆకులతో పూజించిన వారు స్వామికి సమర్పించే ప్రతి తులసి ఆకుకి ప్రతి అశ్వమేదయాగం చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో దీపదానం చేసేవారికి బ్రహ్మ హత్య- ఇతర దోషాలు కూడా తొలగిపోతాయి. 
 
మార్గశిర మాసం అంతా ఉదయం, సాయంత్రం ఇంటి ముంగిట ముందు దీపం వెలిగిస్తే ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మార్గశిర మాసంలో మహావిష్ణువుకు ఆవునేతితో దీపం వెలిగించి.. విష్ణుసహస్ర నామం, భగవద్గీత పారాయణ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. 
 
మార్గశిర మాసంలో గురువారం చేసే పూజలు అత్యంత విశిష్టమైనవి. మార్గశిర మాసం ఎన్ని పర్వాలకు నెలవుగా పరిగణిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మార్గశిర శుద్ధ ఏకాదశిని "వైకుంఠ ఏకాదశి" అని దీనిని మోక్ష ఏకాదశి అంటారు. 
 
ఈ పర్వదినాన వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుండి వెళ్లి దేవున్ని దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని విశ్వాసం. ఈ ఏకాదశి రోజునే గీతా జయంతి అంటే భగవద్గీతను కృష్ణుడు ప్రబోధించాడని పురాణాలు చెప్తున్నాయి.
 
అలాగే మార్గశిర పంచమి రోజున వారాహి దేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సుఖశాంతులు వెల్లివిరిస్తాయి. వారాహి దేవికి పంచముఖ దీపాన్ని నేతిలో వెలిగించాలి. పంచమి రోజున సాయంత్రం ఇలా చేస్తే సకలసంపదలు చేకూరుతాయి. 

అన్నీ చూడండి

హోటల్ గదికి వెళ్లిన నవ వధువు.. ఐదు సెకన్లలో మృతి.. ఏం జరిగింది..?

రఘురామకృష్ణంరాజుకి తీరిన నోటిదూల -రూ.237 కోట్ల బ్యాంకుల కుంభకోణం కేసులో సుప్రీం షాక్

అత్యంత వేగంగా బలపడుతున్న అర్నాబ్ తుఫాను - తీర ప్రాంత వాసులకు హైఅలెర్ట్

పెళ్లి చేసుకోకపోతే ఫ్యానుకు ఉరేసుకుంటానంటూ ప్రియుడికి వార్నింగ్.. అన్నంత పని చేసిన ప్రియురాలు

Hyderabad: దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్... బాల్య వివాహాన్ని అలా అడ్డుకున్నారు...

అన్నీ చూడండి

26-10-2026 సోమవారం దిన ఫలాలు - బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి...

25-10-2026 ఆదివారం నాటి రాశి ఫలాలు- అనవసరమైన ఖర్చులకు దూరంగా వుంటే.?

25-10-2026 నుంచి 31-10-2026 వరకు మీ వారఫలాలు - ఎవరినీ తప్పుపట్టవద్దు

కలలో ఏమైనా తింటున్నట్లు చూస్తే.. పండ్ల రసం తాగినట్లు కలగంటే?

24-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు - మాటల్లో సంయమనం పాటించడం మంచిది..

తర్వాతి కథనం
Show comments