గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 డిశెంబరు 2022 (12:07 IST)

అమీర్ ఖాన్ కొత్త లుక్.. జగపతి బాబులా కనిపించాడు.. మాజీ భార్యతో కలిసి?

Amir khan
Amir khan
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొత్త లుక్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తన ప్రొడక్షన్ ఆఫీసులో అమీర్ ఖాన్ సంప్రదాయ లుక్‌లో పూజలు చేస్తున్నాడు. ఈ ఫోటోను చూస్తే ముందు అందరూ జగపతి బాబు అనుకున్నారు. కానీ కాస్త నెమ్మదిగా చూశాక ఆయన అమీర్ ఖాన్ అని కనిపెట్టారు. 
 
మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి ఈ పూజ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ పూజకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో నుదుటన బొట్టుతో.. చేతికి కంకణంతో, అదే చేతితో కలశం పట్టుకుని కనిపించాడు. ఈ ఫోటోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.