వారి మనోభావాలను దెబ్బతీసిన కియారా-అమీర్ ఖాన్ పెళ్లి?
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్- కియారా అద్వానీ నటించిన ఒక ప్రకటన మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ యాడ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని సోషల్ మీడియాలో పలువురు విమర్శిస్తున్నారు. చిత్రనిర్మాత వివేక్ అగ్నిహోత్రి ఈ ప్రకటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వివేక్ అగ్నిహోత్రి తన ట్విట్టర్‌లో ఇలా రాసుకొచ్చారు. సామాజిక మత సంప్రదాయాలను మార్చడానికి బ్యాంకులు ఎప్పటి నుండి బాధ్యత వహిస్తున్నాయో నేను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాను? అని కామెంట్ చేశారు. ఈ యాడ్‌పై హిందువులు ట్రోల్ చేస్తున్నారు.
ఈ యాడ్‌లో అమీర్ ఖాన్-కియారా అద్వానీలు తమ పెళ్లి నుండి కారులో తిరిగి వస్తున్న నూతన వధూవరులుగా చూపించారు. సాధారణ పద్ధతికి విరుద్ధంగా, అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూసుకోవడంలో ఆమెకు సహాయం చేయడానికి వరుడు వధువు ఇంటికి వెళ్లాడని తెలుస్తుంది.
వధువు సంప్రదాయానికి విరుద్ధంగా వరుడు వారి కొత్త ఇంట్లో మొదటి అడుగు వేస్తాడు. అప్పుడు అమీర్ ఖాన్ ఒక బ్యాంకులో కనిపించి, "శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలు అలా ఎందుకు కొనసాగాలి? అందుకే ప్రతి బ్యాంకింగ్ సంప్రదాయాన్ని ప్రశ్నిస్తాం. తద్వారా మీరు ఉత్తమ సేవను పొందుతారు... అని నడుస్తోంది. ఈ యాడ్‌పై ప్రస్తుతం ట్రోల్స్ మొదలైయ్యాయి.