గురువారం, 28 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (16:02 IST)

పితృ దోషాలు తొలగిపోవాలంటే.. సోమవారం ఉపవాసం వుండి?

Shradh Paksha
పితృపక్షం సమయంలో పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూర్చడానికి పిండప్రదానం చేస్తే పూర్వీకుల దీవెనలు లభిస్తాయి. పూర్వీకులు మరణించిన తేదీ తెలిస్తే ఆ తేదీన శ్రాద్ధ కార్యక్రమం నిర్వహించి. పిండదానం చేయడం వల్ల వారి ఆత్మలు శాంతిస్తాయి. 
 
ఇక పితృపక్షం సమయంలో వీలైతే సోమవారం నాడు ఉపవాసం ఉండి... ఆకలితో ఉన్నవారికి, పేదలకు ఆహారాన్ని ఇస్తే పితృ దోషాలు తొలగిపోతాయి. ఇంటికి వచ్చిన అతిథులను, యాచకులను అవమానించకుండా వారికి ఆహారాన్ని ఇస్తే కూడా పితృ దోషాలు తొలగిపోతాయని, మంగళవారం నాడు వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు సేవ చేస్తే పితృ దోషాలను తొలగించుకోవచ్చు. 
 
పితృపక్షం రోజుల్లో మన పూర్వీకులు పావురం లేదా పక్షుల రూపంలో ఇంటికొస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందుకే భోజనం, నీరు వంటి ఏర్పాట్లు సదా చేసి ఉంచాలని సూచిస్తున్నారు. పితృపక్షంలో ఇంటి శుభ్రతపై శ్రద్ధ వహించాలి. 
 
కానీ, సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయడం వంటి ఏ పని చేయకూడదు. ప్రతిరోజూ మీరు పితృ పక్షంలో ఆహారాన్ని తయారుచేసేటప్పుడు, దానిలో కొంత భాగాన్ని తీసుకొని పూర్వీకుల పేరుతో గోవుకు తినిపించండి.