ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (14:35 IST)

సెప్టెంబర్ 18న చంద్రగ్రహణం.. ఈ రాశులకు అదృష్టం

moon
చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న సంభవించబోతోంది. ఇది ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం. ఈసారి భాద్రపద మాసంలోని పౌర్ణమి రోజున సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం కొన్ని రాశులకు అదృష్టాన్నిస్తుంది. 
 
ఈ క్రమంలో ఈ చంద్ర గ్రహణం వృషభ రాశి వారికి శుభసూచకాలను తెస్తుంది. ఈ రాశి వారికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం చాలా మంచిది. ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో మాత్రమే కాదు ప్రేమ జీవితంలో గొప్ప విజయాన్ని పొందవచ్చు.
 
తులారాశి: ఈ ఏడాదిలో చివరి చంద్ర గ్రహణం తుల రాశి వారికి అదృష్టం తీసుకుని వస్తుంది. ఈ రాశి వారికి చంద్ర గ్రహణం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇకపోతే.. ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 18 ఉదయం 6:11 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 10:17 గంటలకు ముగుస్తుంది. ఇది భారత దేశంలో కనిపించదు.