బుధవారం, 11 సెప్టెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2024 (22:23 IST)

11-08-2004 నుంచి 17-08-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఆత్మీయులను విందులు, వేడుకకు ఆహ్వానిస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉపాధ్యాయుల కష్టం ఫలిస్తుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థికంగా బాగుంటుంది. రుణ సమస్యలు తొలగుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. బుధవారం నాడు పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. పాత మిత్రుల కలయిక అనుభూతినిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణవేదికలు అన్వేషిస్తారు. వస్త్ర, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విమర్శలను ధీటుగా ఎదుర్కుంటారు. మీ చిత్తశుద్ధికి ప్రశంసలు లభిస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు సహాయ సహకారాలు అందిస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణవేదికలు అన్వేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సన్నిహితులను విందులుకు ఆహ్వానిస్తారు. గురువారం నాడు కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన పెట్టుబడులు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు కొత్త అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. దైవకార్యాలు, సన్మాన, సభల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీదైన రంగంలో రాణిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. ధనలాభం ఉంది. ఖర్చులు విపరీతం. ప్రణాళికాబద్ధంగా పనులు సిద్ధం చేసుకుంటారు. గృహంలో సందడి నెలకొంటుంది. దంపతుల మధ్య అనురాలగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. శుక్రవారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయిన వారితో ఉత్సాహంగా గడుపుతారు. వస్త్ర, బంగారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం సంతృప్తినిస్తుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మీ ఓర్పునకు పరీక్షాసమయం. లక్ష్యసిద్ధికి మరింత శ్రమించాలి. అపజయాలకు కుంగిపోవద్దు. ఆశావహదృక్పథంతో మెలగండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఆదివారం నాడు పనులు సాగవు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. ఆదాయం సంతృప్తికరం. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం కొంతమేరకు ఆశాజనకం. పరిస్థితులు మెరుగుపడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ కృషికి సన్నిహితులు ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. పెట్టుబడులకు తరుణం కాదు. పనులు హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతి తీరును గమనించి మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. సంతానం విద్యాయత్నాలు ఫలిస్తాయి. పాతమిత్రులను కలుసుకుంటారు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వస్త్రప్రాప్తి, కుటుంబ సౌఖ్యం పొందుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. సంతానానికి శుభపరిణామాలున్నాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. వస్త్ర, బంగారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తుల పదవీయోగం, స్థానచలనం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సర్వత్రా అనుకూలం. ప్రముఖులకు మరింత చేరువవుతారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఏది జరిగినా ఒకందుకు మంచికే. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. సోమవారం నాడు పనుల్లో ఒత్తిడి అధికం. మీ జోక్యంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. మార్కెటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మీ ఆధిపత్యానికి తిరుగు ఉండదు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు వేగవంతమవుతాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. దంపతుల మధ్య అనురాగ వాత్యల్యాలు వెల్లివిరుస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. అవివాహితులకు శుభయోగం. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో వ్యవహరించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా కుదుటపడతాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. గురు, శుక్రవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. శక్తిసామార్థ్యాలపై నమ్మకం పెంచుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. శనివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు. శకునాలను పట్టించుకోవద్దు. నోటీసులు అందుకుంటారు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. గృహంలో మార్పుచేర్పులు అనివార్యం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకకు హాజరుకాలేరు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. దైవకార్యాలు, విలాసాలకు వ్యయం చేస్తారు. పెట్టుబడులు అనుకూలించవు. పనులు సానుకూలమవుతాయి. ఆది, సోమవారాల్లో ప్రలోభాలకు లొంగవద్దు. మీ చిత్తశుద్ధిని కొంతమంది శంకిస్తారు. మనోధైర్యంతో మెలగండి. మీపై వచ్చిన అభియోగాలు త్వరలో సమసిపోతాయి. అవివాహితులకు శుభయోగం. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు పనిభారంతో తీరిక ఉండదు. రిటైర్డు ఉద్యోగస్తులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.