ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 29 జూన్ 2024 (20:11 IST)

30-06-2024 నుంచి 06-07-2024 వరకు ఫలితాలు- ఏ రాశికి చేతిలో ధనం నిలవదు

weekly horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం 
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. దూరపు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సంతానానికి శుభయోగం. ఆశించిన పదవులు దక్కవు. ఇదీ ఒకందుకు మంచిదే. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. సొంత వ్యాపారాలకు తరుణం కాదు. ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి స్థానచలనం. రిటైర్డు ఉద్యోగస్తులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్యలు తొలగుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. మంగళవారం నాడు ఫోన్ సందేశాలను నమ్మవద్దు. మీ నుంచి విషయసేకరణకు కొందరు యత్నిస్తారు. అందరితో మితంగా సంభాషించండి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. గృహనిర్మాణాలు, మరమ్మతులు ముగింపు దశకు చేరుకుంటాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా స్థిమితపడతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సోదరులతో సంప్రదిస్తారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై దృష్టిపెడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పాతమిత్రులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసాన్నిస్తాయి. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో జాగ్రత్త. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. ఉపాధి పథకాలు చేపడతారు. నిర్మాణాలు ముగింపు దశకు చేరుకుంటాయి. స్థిరాస్తుల వ్యవహారంలో మెలకువ వహించండి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధకు సంకల్ప బలం ముఖ్యం. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. అందివచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. ఖర్చులు అంచనాలు మించుతాయి. ఆదాయమార్గాలు అన్వేషిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. శుక్రవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. గృహమార్పు అనివార్యం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. అధికారులకు హోదామార్పు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహపరుస్తాయి. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. వ్యవహారానుకూలత ఉంది. ఓర్పుతో అనుకున్నది సాధిస్తారు. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. గురువారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అనివార్యం. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. మీ ప్రమేయంతో ఒకరికి మేలు జరుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. దృఢసంకల్పంతో వ్యవహరిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. శనివారం నాడు పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. అసాధ్యమనుకున్న పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారం అన్ని విధాలా అనుకూలదాయకం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. దంపతుల మధ్య అనురాగవాత్యల్యాలు వెల్లివిరుస్తాయి. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీ. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఓర్పుతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కీలక పత్రాలు అందుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగపరంగా ఆశించిన ఫలితాలుంటాయి. అధికారులకు హోదామార్పు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ఆదాయాభివృద్ధి. సాఫ్ట్వేర్ విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ప్రతి విషయంలోను ఆచితూచి అడుగేయాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో నిర్లక్ష్యం తగదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సోమవారం నాడు కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ శ్రీమతి ధోరణి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. కీలక పత్రాలు అందుకుంటారు. అయిన వారితో సంభాషిస్తారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. నూతన వ్యాపారాలపై దృష్టిపెడతారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. యత్నాలు కొనసాగించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. బుధవారం నాడు చేసిన పనులే చేయవవలసి వస్తుంది. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్మాత్మికతపై ఆసక్తి పెంపొందుతుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధనయోగం ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. మీ నమ్మకం వమ్ముకాదు. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సందేహాలు, అపోహలకు తావివ్వవద్దు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. శుక్రవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. కిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ఉపాధ్యాయులకు పదోన్నతి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
గ్రహసంచారం అనుకూలంగా ఉంది. విశేషమైన ఫలితాలున్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. సంస్థల స్థాపనలకు సమయం కాదు. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, పురస్కారయోగం. సాఫ్ట్‌వేర్ విద్యార్థులకు ఉన్నతావకాశాలు లభిస్తాయి.