గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2024 (10:39 IST)

కన్యారాశిలోకి సూర్యుడు.. త్రిగ్రాహి యోగం.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

kanya rashi
నవగ్రహాలకు అధిదేవత అయిన సూర్యుడు.. సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం తన ఇంటిని మార్చుకోనున్నాడు. ప్రస్తుత రాశి సింహరాశి సంచరిస్తున్న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కన్యారాశిలో మరో రెండు గ్రహాలతో కలిసి సూర్యుడు ఉండనున్నాడు. దీంతో త్రిగ్రాహి యోగా ఏర్పడనుంది. ఇప్పటికే కన్యారాశిలో కేతువు ఉన్నాడు. 
 
సెప్టెంబర్ 23న బుధుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల కన్యారాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ మూడు గ్రహాలను శుభప్రదంగా భావిస్తారు. కన్యారాశిలో సూర్య భగవానుడి సంచారం కొన్ని రాశులకు లాభదాయకంగా ఉంటుంది. అలాంటి వాటిలో కన్యారాశి త్రిగ్రాహి యోగం కలిసివస్తుంది. సూర్య సంచార ప్రభావం వల్ల కన్యా రాశి వారు మరింత చురుకుగా ఉంటారు. వ్యాపారాభివృద్ధి వుంటుంది. 
 
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడానికి ఇది ఉత్తమ సమయం. జీవిత లక్ష్యాలను సాధించడంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు విజయం సాధిస్తారు.  
 
త్రిగ్రాహి యోగం తులా రాశి వారిపై సానుకూల ప్రభావం చూపనుంది. వ్యాధుల నుంచి ఉపశమనం కలగనుంది. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలు చేకూరుతాయి. పిల్లలకు సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. 
 
వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులు కూడా సూర్య సంచారంతో సానుకూలంగా ప్రభావితం కాబోతున్నారు. వ్యాపారంలో ఆర్థికంగా పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. వీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. త్రిగ్రాహి యోగం ఈ రాశి వారిపై సానుకూల ప్రభావం చూపుతుంది. మకర రాశి వారికి విజయావకాశాలు మెండుగా ఉంటాయి. 
 
అదే సమయంలో కొన్ని రాశుల వారికి సూర్య భగవానుడి సంచారం చాలా ఇబ్బందులను తెస్తుంది. కుంభ రాశి, మేష రాశి వారికి సూర్యుని సంచారము మంచిది కాదు. ఈ సంచారము వలన అనుకోని విధంగా అధిక ధనం ఖర్చు అవుతుంది. 
 
మరి కొంత మంది తీవ్ర రోగాల బారిన పడవలసి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యాధులకు సూర్య భగవానుడు కారణం. కనుక మేషరాశి, కుంభరాశిపై సూర్యుని సంచారం మంచి ప్రభావం చూపదు. ఈ సమయంలో ఈ రాశులకు చెందిన వారు ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది.