ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 సెప్టెంబరు 2022 (17:38 IST)

వీర భోగ వసంతరాయులుగా బ్రహ్మంగారు పుడతారు..

Veera Brahmendra Swamy
సాక్షాత్తూ దైవ స్వరూపుడైన పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు ఒక్కొక్కటి జరుగుతూనే వున్నాయి. మరెన్నో సంఘటనలు భవిష్యత్తులో జరగబోతున్నాయి. బ్రహ్మాం గారి కాల జ్ఞానంలో జరిగే సంఘటనలేంటో చూద్దాం. 
 
సృష్టికి ప్రతిసృష్టి చేయాలంటూ అనేక రకరకాల యంత్రాలను తయారు చేస్తారు. అవయవాలను అమరుస్తారు. అయితే చావుని తప్పించే యంత్రాన్ని మాత్రం కనిపెట్టలేరు. దేశంలో పెద్ద పొగ మేఘం కమ్మకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని అధికంగా మరణిస్తారు. 
 
కంచి కామాక్షి దేవత కంటి వెంట నీరు కారుతుంది. అనంతరం వేలాదిమంది మరణిస్తారు. కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పుడుకను తాకుతుంది. రాజులు బిచ్చగాళ్ళు అవుతారు. భిక్షాటన చేసేవారు ధనవంతులవుతారు.
 
అడవి మృగాలు జవాసాలు బాట పడతాయి. పట్టణాలు, పల్లెల్లో తిరుగుతాయి. అడవులు, అరణ్యాల్లో మంటలు ఏర్పడి.. రోజుల తరబడి మండుతాయి. కృష్ణానది మధ్యలో రథం కనబడుతుంది. ఆ రథాన్ని చూసిన వారి కళ్లు పోతాయి. రెండు బంగారు హంసలు భూమి మీద తిరుగుతాయి. అతిశతో వాటిని పట్టుకోవాలనుకునేవారు నాశనం అవుతారు.
 
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం పర్వతంపై మొసలి సంచరిస్తుంది. ఆ మొసలి 8 రోజులు ఉండి భ్రమరాంభ గుడిలో చేరి మేకపోతులా అరిచి మాయమవుతుంది. తూర్పు దేశమంతా నవ నాగరికత పేరుతో విచ్చలవిడి తనం పెరుగుతుంది. అధికంగా ధనం సంపాదించినవారు తిరిగి ధనహీనులై దరిద్రులైపోతారు. ఇత్తడి బంగారం అవుతుంది. వివాహాల్లో కులగోత్రాల పట్టింపులను వదులుతారు.
 
వ్యాపారం ధర్మ బద్ధంగా చేయాలనుకునేవారు కనుమరుగవుతారు. ధనార్జనే ధ్యేయంగా జీవితాన్ని సాగిస్తారు. ప్రపంచంలో నదులు ఉప్పొంగుతాయి. వరదలు బీభత్సం సృష్టిస్తాయి. 
 
జలప్రవాహాలు ముంచెత్తడం వల్ల 14 నగరాలు మునిగిపోతాయి. ఆనంద నామ సంవత్సరాలు 13 గడిచే వరకు ఈ నిదర్శనాలు కనబడతాయన్నారు. ఇలా జరిగిన సమయంలో తాను మళ్లీ వీర భోగ వసంతరాయులుగా జన్మిస్తానని చెప్పారు.