Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగవంతునికి ప్రసాదం ఎందుకు పెట్టాలంటే..?

Written By సెల్వి
Updated: బుధవారం, 21 ఏప్రియల్ 2021 (18:09 IST)
భగవంతునికి ప్రసాదం ఎందుకు పెట్టాలని తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదావాల్సిందే. సాధారణంగా తమ మనోవాంచలు నెరవేర్చుకోవడం దేవతలకు పూజ చేసి ప్రత్యేక రోజులలో ప్రసాదాలు సమర్పించడం జరుగుతుంది. ఇది సరైనా పద్దతేనా అంటే.. ఆధ్యాత్మిక పండితులు ఏం చెప్తున్నారంటే.. భగవంతుడు సర్వశక్తిమంతుడు. వాస్తవానికి అతడు భక్తుడి నుండి ఏమీ ఆశించడు. అతను మనఃస్పూర్థిగా ఇచ్చినదేదైనా సంతోషంగా స్వీకరిస్తాడు. అది ఫలమైనా, పుష్పమైనా ఏదైనా సరే. అది కూడా భక్తుని సంతృప్తి పరచడానికే తీసుకుంటాడు. 
 
కనుక తన సంతృప్తికై భక్తుడు తన ఇష్టదైవానికి తీపి వంటకమో, పుష్పమాలయో, ధూపదీపాలో లేక మరే ఇతరమైనవో సమర్పించుకుంటాడు. అంతే కాని ఏ దేవుడు నాకిది కావాలని అడగడు. ఇచ్చింది కాదనడు. దైవానికి నైవేద్యం సమర్పించడమంటే భగవంతుడికి పూర్ణంగా శరణు జొచ్చడమని భావం. 
 
దేవుని పూజకు కావలసినవి సమర్పించిన తరువాత భక్తుడి ఆత్మవిశ్వాసం, దైవవిశ్వాసం పెరిగి తన ప్రార్థనా లక్ష్యంపై మనసు సంపూర్ణంగా లగ్నం కాదు. ప్రసాదం అంటే దేవునికి లంచం ఇవ్వడం కాదు. భక్తుడు తనకోసమై తనదనుకుంటున్న సొత్తును కాస్త భగవంతుడికి అర్పించడం. అలాగే అది తనకు భగవానుడే ఇచ్చాడు అని భావించడం అనేది నైవేద్యం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.

అన్నీ చూడండి

సెప్టెంబర్ 09, 2026 తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది..?

విమానం కాదు.. ఆర్టీసీ బస్సు - కేఎస్ఆర్టీసీ బస్సులో లగ్జరీ సౌకర్యాలు

అడ్వెంచర్ పార్కులో చికెన్ పెడుతూ మొసలికి చిక్కిన కేర్‌టేకర్ (వీడియో)

అనకాపల్లిలో పట్టుబడిన లంచావతారం, ఒక్కసారి మీ ముఖాన్ని చూపిస్తే ఫోటో తీసుకుంటాం, వీడియో

ముంబైలో ప్రధాని.. వేదిక వద్ద తుపాకీతో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

అన్నీ చూడండి

09-09-2026- బుధవారం మీ రాశి ఫలితాలు.. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు

Tirumala: తిరుమల రాజగోపురంపై శ్రీకృష్ణుని విగ్రహపు చేయి విరిగిపోయిందా?

టీటీడీ భద్రతా ఉద్యోగులకు మాజీ సైనికులు అర్హులే..

08-09-2026 మంగళవారం ఫలితాలు - అనవసరమైన ఖర్చులు చేయవద్దు..

శ్రీవారి బ్రహ్మోత్సవాలు-2026.. టీటీడీ సిబ్బంది వివరాల తనిఖీ.. క్రిమినల్ కేసులు ఉన్నాయేమో?

తర్వాతి కథనం
Show comments