Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

మూడో శ్రావణ శుక్రవారం... పంచమి కూడా వచ్చేస్తోంది..

Written By సెల్వి
Updated: శుక్రవారం, 23 ఆగస్టు 2024 (14:07 IST)
శ్రావణమాసం అందులోను శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఫలప్రదం అవుతుందని భక్తుల విశ్వాసం. శ్రావణమాసం మూడో శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. 
 
ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తెలుపు, ఎరుపు రంగు పువ్వులు అమ్మవారికి సమర్పించాలి. గులాబీ పువ్వులు, తామర పువ్వులు సమర్పించవచ్చు. 
 
సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీలక్ష్మిని పూజించవచ్చు. శ్రావణ శుక్రవారం మొక్కలు నాటడం వల్ల సంపద పెరుగుతుంది. శుక్రవారం రోజుల్లో డబ్బు దానం చేయడం శుభప్రదం. 
 
ఇంకా శ్రావణ శుక్రవారం పంచమి కలిపి రావడంతో.. ఐదు నూనెలను కలగలిపి.. ఆమెకు దీపం వెలిగిస్తే సకలసంపదలు వెల్లివిరుస్తాయి. ఈ దీపానికి ఎరుపు వత్తులను వాడటం మంచిది. నైవేద్యంగా పొట్టు తీయని మినపప్పుతో తయారు చేసిన గారెలు లేకుంటే నవధాన్యాలతో చేసిన గారెలను, పెరుగన్నం, శెనగలు, పానకం వంటివి సమర్పించవచ్చు.  
 
ఇంకా "ఓం శ్రీ పంచమి దేవియే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. ఇంట సుభిక్షానికి కొదవవుండదు. రుణబాధలుండవు. దారద్ర్యం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

తిరుమల వార్తలు: మోకాళ్ల మెట్టు వద్ద చిరుతపులి.. శ్రీవారిని దర్శించుకున్న శిఖర్ ధావన్

Vijayawada: వివాహితను బెదిరించిన మాజీ ప్రియుడు.. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను...?

Balapur Plastic Godown.. బాలాపూర్ ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం

కారులో పరాయి మహిళతో భర్త రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...

9/11 తరహా దాడులకు కుట్ర : ఫ్లైదుబాయ్ కో-పైలెట్ వాంగ్మూలం

అన్నీ చూడండి

05-10-2026 సోమవారం ఫలితాలు - ఆశించిన పదవి దక్కకపోవచ్చు...

04-10-2026 - ఆదివారం రోజువారీ రాశి ఫలాలు - ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత పెరుగుతుంది

అక్టోబర్ 10 నుండి 18 వరకు వైభవంగా బతుకమ్మ పండుగ

04-10-2026 నుండి 10-10-2026 వరకు వారఫలాలు - శుభలేఖ అందుకుంటారు

03-10-2026 శనివారం మీ రాశి ఫలాలు - కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి

తర్వాతి కథనం
Show comments