శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2024 (09:55 IST)

పుట్టలో పాలు పోయడం మంచిదేనా?

Nagapanchami
ఆగస్టు 9వ తేదీన నాగపంచమి, గరుడ పంచమి వస్తున్నాయి. ఈ రోజున నాగులను పూజించడం, గరుడాళ్వార్‌ను స్తుతించడం మంచి ఫలితాలను ఇస్తాయి.
 
నాగేంద్రుడు శివుడికి వాసుకిగా, శ్రీ మహావిష్ణువుకు శేషుడిగా తోడు ఉంటాడు కాబట్టి ఈ పంచమి రోజున పుట్టకు పూజ చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. అయితే పుట్టలోపల పాలు పోయడం చేయకూడదు. 
 
పుట్ట పక్కన ఒక పాత్రను వుంచి పాలు పోయాలి. పుట్టలో పాలు పోసినప్పుడు లోపల ఉన్న పాముకు ఊపిరి ఆడక దానికి హాని తలపెట్టినవారమవుతాం. 
 
అయితే పాము విగ్రహాలకు మాత్రం పాలతో అభిషేకం చేయవచ్చు. సంప్రదాయంగా వస్తున్న ఈ ఆచారాన్ని పుణ్య కార్యం కోసం ఉపయోగిస్తే మంచి జరుగుతుంది.