శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : మంగళవారం, 1 మే 2018 (19:01 IST)

బుధవారం మాంసాహారాన్ని లొట్టలేసుకుని తింటున్నారా?

బుధవారం మాంసాహారం తింటున్నారా? అయితే ఇకపై నాన్‌వెజ్ తినడం మానేస్తే మంచిదని పండితులు చెప్తున్నారు. సోమవారం ఈశ్వరునికి, మంగళవారం దుర్గమ్మకు ఎలా శ్రేష్టమో అదే తరహాలో బుధవారం విష్ణుమూర్తికి ప్రీతికరమైన రో

బుధవారం మాంసాహారం తింటున్నారా? అయితే ఇకపై నాన్‌వెజ్ తినడం మానేస్తే మంచిదని పండితులు చెప్తున్నారు. సోమవారం ఈశ్వరునికి, మంగళవారం దుర్గమ్మకు ఎలా శ్రేష్టమో అదే తరహాలో బుధవారం విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజని వారు సూచిస్తున్నారు. ఈ రోజున సమీపంలోని విష్ణుమూర్తి అవతారాల్లోని పెరుమాళ్ల వారిని సేవించే వారికి సుఖసంపదలు వెల్లివిరుస్తాయి. అందుకే మాంసాహార వంటకాలను బుధవారం తినడం మానేయాలి. 
 
శాకాహారం తీసుకుని వేంకటేశ్వర స్వామిని, పెరుమాళ్ల వారి దేవాలయాలను సందర్శించుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవు. కోరిన కోరికలు నెరవేరాలంటే.. బుధవారం ''ఓం నమో నారాయణాయ'' అనే మంత్రాన్ని 108 సార్లు బుధవారం పూట.. ఉచ్ఛరించాలి.

స్థితికారకుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకునేవారు, బుధగ్రహ వ్యతిరేక ఫలాల కారణంగా విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో వెనుకబడుతున్నవారు ఈ వ్రతాచరణ చేయాలి. ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం నాడు ప్రారంభించి, 21 వారాలపాటు ఈ వ్రతాన్ని చేయాలి. బుధవారం పూజచేసేవారు వంటలలో ఉప్పును ఉపయోగించకూడదు. 
 
ఆకుకూరలు, పచ్చ అరటి పండ్లు, పచ్చద్రాక్ష మొదలైన ఆకుపచ్చరంగులో ఉండే ఆహార పానీయాలను మాత్రమే తీసుకోవాలి. పచ్చరంగు వస్తువులు దానం చేయాలి. గోవులకు పచ్చగడ్డిని తినిపించడం శ్రేష్ఠం. ముడిపెసలతో చేసిన పదార్థాలను లేదా పిండివంటలను నైవేద్యం ఇచ్చి, ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే బుధవారం రోజున గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించి గరికను సమర్పించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. 
 
బుధవారం ఆకుపచ్చ దుస్తులు ధరించడం ద్వారా చేపట్టిన కార్యాలు విజయవంతమవడంతో పాటు, శుభ ఫలితాలు చేకూరుతాయి. అదేవిధంగా... స్త్రీలు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు పువ్వులు అంటే సంపంగి వంటివి తలలో ధరించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని పురోహితులు అంటున్నారు.