శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 30 జనవరి 2018 (16:33 IST)

ద్రాక్షల్లో మాంసాహారానికి ధీటైన ప్రోటీన్లు వున్నాయా?

ద్రాక్షల్లోని ల్యూటెన్, యాంటీయాక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. హృద్రోగాలను నియంత్రిస్తాయి. ద్రాక్షల్లో వుండే పొటాషియం, పీచు ద్వారా బీపీని అదుపులో వుంచుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్

ద్రాక్షల్లోని ల్యూటెన్, యాంటీయాక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. హృద్రోగాలను నియంత్రిస్తాయి. ద్రాక్షల్లో వుండే పొటాషియం, పీచు ద్వారా బీపీని అదుపులో వుంచుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ద్రాక్షల్లోని క్వసిటిన్ అలర్జీని దూరం చేస్తుంది. నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది. ద్రాక్షలను రోజు గుప్పెడు తీసుకుంటే మధుమేహం దరిచేరదు.
 
ద్రాక్ష రసాన్ని తాగినట్లైతే గుండెను పదిలంగా వుంచుకోవచ్చు. ద్రాక్ష పండ్లు ఉదర సంబంధిత రోగాలను నయం చేస్తాయి. రోజూ ద్రాక్షలను తీసుకోవడం ద్వారా మాంసాహారానికి ధీటుగా ప్రోటీన్లు పొందవచ్చు. రోజూ ద్రాక్షలను తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ గ్లాసుడు మేర ద్రాక్ష రసం తీసుకుంటే తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. ద్రాక్షల్లో మాంసాహారానికి ధీటైన ప్రోటీన్లు వున్నాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.