సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By tj
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (15:25 IST)

వీటితో మీ ఊపిరితిత్తులు సేఫ్‌....

ధూమపానం చేసేవారు ప్రతిరోజు మూడు టమోటాలు, మూడు యాపిల్స్ తింటే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చునని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ధూమపానం చేసేవారు ప్రతిరోజు మూడు టమోటాలు, మూడు యాపిల్స్ తింటే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చునని వైద్యనిపుణులు  చెబుతున్నారు. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల అంతకుముందే పాడైన ఊపిరితిత్తులను వీటి ద్వారా నయం చేసుకోవచ్చట. మామూలుగా ధూమపానం ప్రియుల ఊపిరితిత్తులు కొంతకాలానికి పనిచేయడం మానేస్తాయట. 900మంది మీద సుధీర్ఘకాలం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఒక నిర్ధారణకు వచ్చారు.
 
900 మంది ధూమపానం అలవాటు ఉన్నావారే. వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపుకు మామూలు ఆహారంతో పాటు ప్రతిరోజు మూడు టమోటాలు, మూడు ఆపిల్స్ ఇచ్చారు. వేరొక గ్రూపుకు సాధారణ ఆహారం మాత్రమే ఇచ్చారు. కొన్నిరోజుల తర్వాత వీరి ఆరోగ్యాన్ని పరిశీలిస్తే టమోటా, ఆపిల్స్ తిన్న వారి ఊపిరితిత్తుల క్షీణిత తగ్గిన విషయాన్ని గుర్తించారు. 
 
సాధారణ ఆహారాన్ని తీసుకున్న వారు మాత్రం వారి ఊపిరితిత్తులు మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం గమనించారు. టమోటా, ఆపిల్స్ కూడా తాత్కాలికంగానే ఊపిరితిత్తులను కాపాడుతాయే తప్ప పూర్తిస్థాయిలో పనిచేయవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.