శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (17:31 IST)

మహిళల్లో ఆ సమస్యకు ఇవే కారణాలు?

మహిళలను వేధించే వైట్ డిశ్చార్జ్ సమస్యకు ఇవే కారణం అంటున్నారు.. వైద్యులు. రక్తహీనత గల వారికి ఈ సమస్య వుంటుంది. నెలసరికి వారానికి ముందు కొందరు మహిళల్లో వైట్ డిశ్చార్జ్ సమస్య ఏర్పడుతుంది. శరీరం వేడైతే, న

మహిళలను వేధించే వైట్ డిశ్చార్జ్ సమస్యకు ఇవే కారణం అంటున్నారు.. వైద్యులు. రక్తహీనత గల వారికి ఈ సమస్య వుంటుంది. నెలసరికి వారానికి ముందు కొందరు మహిళల్లో వైట్ డిశ్చార్జ్ సమస్య ఏర్పడుతుంది. శరీరం వేడైతే, నిద్ర తక్కువైతే.. మానసిక ఆందోళన వంటివి మహిళల్లో వైట్ డిశ్చార్జ్‌కు కారణమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
ఇంకా కాలేయం బలహీనత, శుభ్రత లేని ప్రాంతాల్లో మూత్ర విసర్జన చేయడం ద్వారానూ వైట్ డిశ్చార్జ్ సమస్య ఏర్పడుతుంది. అధిక మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన, పౌష్టికాహార లోపం వంటివి కూడా ఈ సమస్యకు దారితీస్తాయి. 
 
పదే పదే ఆలోచిస్తూ కూర్చోవడం, కారం, ఉప్పు వంటివి అధికంగా తీసుకోవడం ద్వారా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. అందుచేత వైట్ డిశ్చార్జ్‌ను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.