శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (16:55 IST)

పొట్ట తగ్గాలంటే.. వారానికి ఓసారి బ్రోకోలీని ఆహారంలో చేర్చుకోవాల్సిందే

పొట్ట తగ్గించుకోవాలంటే... ముఖ్యంగా జంక్ ఫుడ్స్‌ను దూరంగా వుంచాలి. రోజూ వ్యాయామం చేయాలి. తద్వారా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడం సులభమవుతుంది. రోజూ 8-10 గ్లాసుల నీటిని సేవించాలి. శరీరాన్ని

పొట్ట తగ్గించుకోవాలంటే... ముఖ్యంగా జంక్ ఫుడ్స్‌ను దూరంగా వుంచాలి. రోజూ వ్యాయామం చేయాలి. తద్వారా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడం సులభమవుతుంది. రోజూ 8-10 గ్లాసుల నీటిని సేవించాలి. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. నీటిని తగిన మోతాదులో తీసుకోవడం ద్వారా శరీరంలోని టాక్సిన్లు తొలగిపోతాయి. శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది. తద్వారా పొట్టను తగ్గించుకోవచ్చు.
 
పొట్ట పెరగడానికి పంచదార కూడా కారణమే. టీ, కాఫీల్లో పంచదారకు బదులు తేనెను వాడటం మంచిది. ఇలా మూడు నెలల పాటు చేస్తే శరీర బరువుతో పాటు పొట్ట కూడా తగ్గిపోతుంది. రోజూ ఉదయం కాఫీ లేదా టీ తాగేటప్పుడు అందులో అరస్పూన్ మేర దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే రక్తంలోని చక్కెర స్థాయుల్ని తగ్గించుకోవచ్చు. 
 
బరువు కూడా నియంత్రణలో వుంటుంది. అలాగే ఆరోగ్య కరమైన కొవ్వు శరీరానికి మేలు చేస్తాయి. కాబట్టి స్నాక్స్ సమయంలో వాల్‌నట్స్, బాదం, వేరుశెనగలు వంటివి తీసుకోవడం మంచిది. ఇక సిట్రస్ పండ్లను అధికంగా తీసుకోవాలి. ఇందులో విటమిన్లు శరీరంలో అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది. ఇక కూరగాయల్లో బ్రోకోలీని తీసుకోవాలి. బ్రోకోలీని వారానికి ఓసారి తీసుకుంటే పొట్టను తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.