మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 18 జనవరి 2018 (13:20 IST)

అలా తలని దిండులో దాచుకుని పడుకునే అలవాటుంటే?

మెదడు చురుగ్గా పనిచేయాలా? చలాకీగా మారిపోవాలా? అయితే అలవాట్లను మార్చుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే మెదడు చురుకుగా పనిచేస్తుందని వారు చెబుతున్నారు. అల్పాహారం తరచూ మానేయడం మంచి పద్ధతి కాదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థా

మెదడు చురుగ్గా పనిచేయాలా? చలాకీగా మారిపోవాలా? అయితే అలవాట్లను మార్చుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే మెదడు చురుకుగా పనిచేస్తుందని వారు చెబుతున్నారు. 
 
అల్పాహారం తరచూ మానేయడం మంచి పద్ధతి కాదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి మెదడుకి సరైన పోషకాలు అందవు. దాంతో అది చురుగ్గా పనిచేయదు. తినకపోవడం ఎంత చేటో, అతిగా తినడమూ అంతే చేటు. అతిగా తినడం వల్ల మెదడుకు సంబంధించిన నాళాలు మొద్దుబారి, మెదడు చురుగ్గా పని చేయలేదు. 
 
పంచదార వాడకాన్నీ వీలైనంత వరకు తగ్గించాలి. ఎందుకంటే దాని వాడకం ఎక్కువైతే ఆహారం నుంచి శరీరం పోషకాలని స్వీకరించడం తగ్గిస్తుంది. దీనివల్ల పోషకాహార లేమి ఏర్పడుతుంది. తద్వారా చలాకీగా ఉండలేకపోతారు. 
 
నిద్రలేకుండా పనిచేయకండి. నిద్ర మెదడును శక్తివంతం చేస్తుంది. నిద్ర లేకుండా పనిచేస్తుంటే మెదడులోని కణాలు చచ్చుబడిపోయే ఆస్కారం ఎక్కువ. తలని దిండులో దాచుకుని పడుకునే అలవాటుంటే ఇప్పుడే మానుకోండి. ఎందుకంటే దీనివల్ల మెదడుకి ఆక్సిజన్ బదులుగా మీరు వదిలిన కార్బన్‌డై ఆక్సైడ్ అందుతుంది. అది కాస్త అనారోగ్యంగా ఉన్నప్పుడూ శరీరం సహకరిస్తోందని పనిచేస్తుంటాం.. కానీ మెదడు పని చేయవద్దని సంకేతాలిస్తే ఆ పని ఆపేయడం మంచిది. లేదంటే తీవ్ర అలసటకూ, అనారోగ్యానికి గురవుతాం. మెదడులోని కణాలు నిర్వీర్యమై పనిచేయడం మానేస్తాయి.