మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 29 నవంబరు 2017 (12:49 IST)

కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారా? అలసట తప్పదండోయ్

శారీరక శ్రమ ద్వారా అలసట ఆవహిస్తుందని అందరూ అనుకుంటారు. అయితే వాస్తవానికి మూడు కిలోమీటర్లు పరిగెత్తడంతో ఏర్పడే అలసట కంప్యూటర్ ముందు కూర్చుని కొన్ని మెయిల్స్ పంపడం ద్వారా ఏర్పడుతుందని తాజా పరిశోధనలు తేల

శారీరక శ్రమ ద్వారా అలసట ఆవహిస్తుందని అందరూ అనుకుంటారు. అయితే వాస్తవానికి మూడు కిలోమీటర్లు పరిగెత్తడంతో ఏర్పడే అలసట కంప్యూటర్ ముందు కూర్చుని కొన్ని మెయిల్స్ పంపడం ద్వారా ఏర్పడుతుందని తాజా పరిశోధనలు తేల్చాయి. కంప్యూటర్ ముందు కూర్చున్నా.. శారీరక శ్రమకు సంబంధించిన పనులు చేసినా మెదడు, గుండె పనితీరు ఒకే విధంగా వుంటుందని అమెరికా పరిశోధకులు తేల్చారు. 
 
కంప్యూటర్ల ముందు కూర్చున్నా బస్తాలు మోసినా గుండె ఒకే రీతిలో ఆట్రినల్ ఉత్పత్తి చేస్తుంది. ఇక సెల్ ఫోన్‌ను గంటల పాటు ఉపయోగించే వారికి శారీరక శ్రమ కంటే మెదడు పనితీరు అధికంగా వుంటుంది. ముఖ్యంగా శరీరానికి కావలసిన ఆక్సిజన్ కంటే 20 రెట్లు అధికమైన ఆక్సిజన్ మెదడుకు అవసరమవుతుంది. కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ల ఉపయోగం ద్వారా వాటిలోని ఎలక్ట్రానిక్ వేవ్స్ శరీరానికి అలసటను ఇస్తాయట. ఈ అలసట బరువు ఎత్తడం వంటి ఇతరత్రా శారీరక శ్రమ చేసిన వారికంటే అధికమని అమెరికా పరిశోధకులు చెప్తున్నారు. 
 
ఇలా గంటల పాటు కూర్చుని కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లను ఉపయోగించడం ద్వారా ఏర్పడే అలసటను Computer fatigue అంటున్నారు. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లను ఉపయోగించడం ద్వారా ఒకేచోట కూర్చోవడం చేస్తారు. తద్వారా కండరాలు బిగుతుగా తయారవుతాయి. దీంతో వెన్నునొప్పి, మెడనొప్పి, కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణాలు రక్తపోటు, ఒబిసిటీ, మధుమేహం వంటి రుగ్మతలకు దారితీస్తాయి. 
 
ఇంకా కంప్యూటర్ నుంచి స్మార్ట్ ఫోన్ల నుంచి విడుదలయ్యే కిరణాల ప్రభావం మెదడుపై పడుతుంది. దీంతో మానసిక ఒత్తిడి తప్పదు. కంటికి దృష్టి లోపాలు తప్పవు. నిద్రలేమి కలుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.  కాబట్టి శారీరక, మానసిక ఇబ్బందులకు గురిచేసే కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లను తదేకంగా ఉపయోగించకుండా.. అవసరానికి మాత్రమే ఉపయోగించడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.