శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 28 జనవరి 2018 (14:23 IST)

గర్భవతులు మాత్రమే కుంకుమ పువ్వు వాడాలా?

గర్భవతులు మాత్రమే కుంకుమ పువ్వు పాలల్లో వేసుకుని తాగాలి అనుకుంటారు.. చాలామంది. కానీ ఎవరైనా కాస్త గోరువెచ్చని పాలతో రాత్రి పూట కుంకుమ పువ్వు కలుపుకుని తీసుకుంటే గాఢనిద్ర పడుతుంది. దగ్గు, కడుపు ఉబ్బరం చ

గర్భవతులు మాత్రమే కుంకుమ పువ్వు పాలల్లో వేసుకుని తాగాలి అనుకుంటారు.. చాలామంది. కానీ ఎవరైనా కాస్త గోరువెచ్చని పాలతో రాత్రి పూట కుంకుమ పువ్వు కలుపుకుని తీసుకుంటే గాఢనిద్ర పడుతుంది. దగ్గు, కడుపు ఉబ్బరం చికిత్సకు కూడా కుంకుమ పువ్వు మంచి మందులా పనిచేస్తుంది. అలాగే గోరువెచ్చని పాలతో రాత్రిపూట కుంకుమ పువ్వులు కలిపి తీసుకుంటే గాఢనిద్ర పడుతుంది. 
 
కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది. జీర్ణిక్రియ సంబంధిత సమస్యల నివారణకు ఈ పువ్వు ఉపయోగపడుతుంది. పొటాషియం శరీరంలో తక్కువగా ఉంటే ఒత్తిడి తప్పదు. అందుకే కుంకుమ పువ్వును రాత్రిపూట తీసుకుంటే శరీరానికి ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం వల్ల రక్తపోటు తగ్గుతుంది. తద్వారా గుండె జబ్బులు తగ్గే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇంకా శరీరానికి ఐరన్‌ను కుంకుమ పువ్వు అందిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ తప్పక అవసరం. అంతేగాకుండా.. ఎర్రరక్త కణాల ఉత్పత్తికి ఇది చాలా అవసరం. ఇంకా కుంకుమ పువ్వును రోజు తీసుకునే సూప్స్, రైస్ వంటకాలలో రుచి కోసం వాడొచ్చు. వంటకాలలో, పాలలో కలిపే కుంకుమ పువ్వును మితంగా వాడాలి. రోజుకు రెండు గ్రాములు మించకుండా తీసుకోవడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు.