శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2022 (16:46 IST)

16 సోమవారాలు ఉపవాసం.. శివపార్వతులను పూజిస్తే?

Lord Shiva
16 సోమవారాలు ఉపవాసం వుండి శివపార్వతులను ప్రార్థించే వారికి మానసిక ఆందోళనలు తొలగిపోతాయి.  శాపం కారణంగా కాంతి కోల్పోయిన చంద్రుడు ఉపవాసం ద్వారా కాంతిని పొందాడు. సోమవారం నాడు ఉపవాసం ఉండే వారు ఏ సోమవారమైనా ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. సోమవారం నాడు తెల్లవారుజామున స్నానం చేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి శివపార్వతుల పూజలు నిర్వహించాలి. అలా ఈ వ్రతాన్ని ఆచరించే వారికి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. 
 
దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. అలాగే విడిపోయిన భార్యాభర్తలు సోమవారం నాడు ఉపవాసం ఉంటే వారి మధ్య సంబంధాలు బలపడతాయి. ఈ వ్రతంలో పెద్దల ఆశీస్సులు చాలా ముఖ్యం. అందుకే తల్లిదండ్రులు లేదా అత్తమామలు లేదా వృద్ధ దంపతుల నుండి ఆశీర్వాదం తీసుకోవచ్చు. 
 
సోమవారం నాడు శివుడు, పార్వతి దేవితో ఉన్న ప్రతిమకు బిల్వ అర్చన చేయవచ్చు. లింగాష్టకం పఠించవచ్చు. పంచాక్షరీ జపించవచ్చు. శివ పార్వతికి చెందిన మంత్రాలను జపించవచ్చు. పూర్తిగా ఉపవాసం చేయలేని వారు నీటిని భోజనంగా తీసుకోవచ్చు. 
 
పండ్ల రసాలు, పాలు, పండ్లు మొదలైన వాటిని తీసుకోవడం ద్వారా ఉపవాసం చేయవచ్చు. అలాగే  పండ్లు, పాయసం, పంచదార పొంగలిని శివపార్వతులకు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇలా వరుసగా 16 సోమవారాలు ఉపవాసం ఉండి శివపార్వతులను పూజిస్తే మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. భార్యాభర్తల మధ్య ఐక్యత బలపడుతుంది.