గురువారం, 28 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 జులై 2023 (18:55 IST)

కష్టాలను తొలగించే శనివారం సుందరకాండ పారాయణం

Hanuman
రామాయణం, మహాభారతం గొప్ప ఇతిహాసాలు. ఇది మనకు లభించిన రెండు విలువైన రత్నాలు. అలాగే మంత్రాల రత్నంగా సుందరకాండకు పేరుంది. రామ అనే మధురమైన నామాన్ని చెబితే హనుమంతుని అనుగ్రహం మనకు లభిస్తుంది. మానవ జీవితంలో ఏ సమస్య వచ్చినా తక్షణమే సుందరకాండ పారాయణం చేయడం మంచిది.
 
రాముని నుండి విడిపోయిన సీతాదేవి దుఃఖాన్ని పోగొట్టడానికి రామునిపై నమ్మకం కారణంగా హనుమంతుడు సాగరాన్ని దాటినవాడు. హనుమంతుడు, సుందరకాండము పారాయణ చేసిన వారికి ఎలాంటి కష్టాలుండవు. ప్రతిరోజూ హనుమంతుడిని పూజించాలి. సుందరకాండ చదివితే... జీవితంలో కష్టాలు దరిచేరవు. 
 
సూర్య భగవానుడు హనుమంతుని గురువు. అందుకే సూర్యస్తుతితో ఆంజనేయుడిని ప్రసన్నం చేసుకోవచ్చునని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.