గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : ఆదివారం, 24 డిశెంబరు 2017 (08:08 IST)

24-12-17 ఆదివారం రాశి ఫలితాలు

మేషం: వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీ ఆందోళన కలిగిస్తుంది. ఇంటా బయటా మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. ఉపాధ్యాయులకు విశ్ర

మేషం: వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీ ఆందోళన కలిగిస్తుంది. ఇంటా బయటా మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి.
 
వృషభం: వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి. ప్రేమికుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. ప్రింటింగ్ రంగాల వారికి అక్షర దోషాల వల్ల చికాకులు తప్పవు. మీ సంతానం మొండితనం చికాకు పరుస్తుంది. ఆత్మీయులతో కలిసి విందులు, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మిథునం: పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. దుబారా ఖర్చులు అధికం. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. ఆత్మీయులకు, చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు. క్రీడా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం: శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. రావలసిన ధనం అతికష్టం మీద వసూలవుతుంది. మీ శ్రీమతి సలహా ప్రకారమే నడుచుకుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. భాగస్వామికంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
సింహం: మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. మిత్రులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు సన్నిహితుల ప్రోత్సాహంతో ఉపాధి పథకాలు చేపడతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో ప్రతికూలతలు ఎదురవుతాయి.
 
కన్య: వ్యాపారాల అభివృద్ధికి షాపుల అలంకరణ, కొత్త స్కీములు అమలు చేస్తారు. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులు వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
తుల: దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఉత్తర  ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ పనులు మందకొడిగా సాగుతాయి.
 
వృశ్చికం: కుటుంబీకులతో కలిసి  పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు రాత, మౌఖికపరీక్షల సమాచారం అందుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం.
 
ధనస్సు: ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నెమ్మదిగా సమసిపోతాయి. ప్రకటనలు, దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లక్ష్యసాధన కోసం కొత్త పథకాలు రూపొందిస్తారు. విదేశీయత్నాల్లో ప్రయాసలకు లోనవుతారు. వృధా ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం నెరవేరదు. దైవకార్యాల పట్ల ఆసక్తి నెలకొంటుంది.
 
మకరం: ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల వేధింపులు అధికం. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు, ఆందోళన కలిగిస్తుంది. చేతివృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి.
 
కుంభం : కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. పత్రిక, వార్తా సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఎదుర్కొంటారు. పాత మిత్రుల కలయిక ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
 
మీనం: విందులలో పరిమితి పాటించండి. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతారు. మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవిస్తాయి. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు.