బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : బుధవారం, 31 జనవరి 2018 (15:54 IST)

చంద్రగ్రహణం: ఏ రాశులకు శుభం.. ఏ రాశులకు అశుభమో తెలుసుకోండి..

చంద్రగ్రహణం.. మాఘ శుద్ధ పౌర్ణమి.. అనగా జనవరి 31వ తేదీ. బుధవారం. చంద్రగ్రహణము బుధవారం రావడం ద్వారా గ్రస్తోదితము, ఖగ్రాస చంద్ర గ్రహణం. అంటే సంపూర్ణ చంద్ర గ్రహణం అని అర్థం. ఈ చంద్ర గ్రహణం మనదేశంలో కనిపిస

చంద్రగ్రహణం.. మాఘ శుద్ధ పౌర్ణమి.. అనగా జనవరి 31వ తేదీ. బుధవారం. చంద్రగ్రహణము బుధవారం రావడం ద్వారా గ్రస్తోదితము, ఖగ్రాస చంద్ర గ్రహణం. అంటే సంపూర్ణ చంద్ర గ్రహణం అని అర్థం. ఈ చంద్ర గ్రహణం మనదేశంలో కనిపిస్తుంది. 
 
అందుచేత గ్రహణ నియమాలను తప్పకుండా పాటించాలి. 
గ్రహణ సమయాలను ఓసారి పరిశీలిస్తే.. 
గ్రహణ స్పర్శ కాలము -సాయంత్రం  05.18 నిమిషాలకు
గ్రహణ మధ్య కాలము- రాత్రి 7 గంటలకు 
గ్రహణ మోక్ష కాలము - రాత్రి 08.42 నిమిషాలకు. 
దీనిని బట్టి చంద్ర గ్రహణం సాయంత్రం 05-18 గంటలకు ప్రారంభమై.. రాత్రి 08.42 నిమిషాలతో ముగుస్తుంది. గ్రహణ మొత్త కాలం మూడు గంటలా 24 నిమిషాలు. 
 
గ్రహణ నియమాలను ఇలా పాటించండి... 
గ్రహణ స్పర్శ కాలానికి 9 గంటల ముందు గ్రహణ ప్రభావం ప్రారంభమవుతుంది. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు గ్రహణ స్పర్శ కాలం నుంచి గ్రహణ మోక్ష కాలం వరకైనా గ్రహణ నియమాలను పాటించాలి. 
 
ఏ రాశులకు మంచిది:
వృషభ, కన్య, తులా, కుంభ రాశుల వారికి మంచి ఫలితాలు వుంటాయి. 
మిథునం, వశ్చికం, మకర, మీన రాశుల వారికి మిశ్రమ ఫలం 
మేషం, కర్కాటకం, సింహ, ధనస్సు రాశుల వారికి అశుభ ఫలితాలను సూచిస్తుంది.
 
గ్రహణాన్ని వీరు వీక్షించకూడదు. 
మేషం, కర్కాటకం, సింహ, ధనస్సు రాశుల వారు, గర్భిణీ మహిళలు గ్రహణాన్ని వీక్షించకూడదు. అలాగే చంద్ర గ్రహణం పుష్యమి నక్షత్రంలో ప్రారంభమై ఆశ్లేష నక్షత్రంలో ముగుస్తున్నందున పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలను జన్మ నక్షత్రాలుగా కలిగిన వారు చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు.